ఫొటోటాక్ : కళ్లు తిప్పనివ్వని స్టైలిష్ బికినీ బ్యూటీ

Tue Sep 29 2020 11:00:49 GMT+0530 (IST)

Akshara Gowda Latest Stunning Pose In Bikini

కన్నడకు చెందిన అక్షర గౌడ హిందీ.. తమిళం.. కన్నడ సినీ ప్రేక్షకులకు సుపరిచితం అయ్యింది. సినీ రంగ ప్రవేశం చేసి పదేళ్లు అయ్యింది. మెల్లగా వచ్చిన ప్రతి ఆఫర్ ను కమిట్ అవ్వకుండా మంచి పాత్రలు చేసుకుంటూ వెళ్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన ఫాలోవర్స్ కు కన్నుల వింధు చేస్తుంది. తాజాగా ఈమె ఈ ఫొటోను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. స్విమ్మింగ్ పూల్ లో ఈ అమ్మడి అందాల ఆరబోత ఫాలోవర్స్ ను తడిపి ముద్ద చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫొటో షూట్స్ తో ఈ మద్య హీరోయిన్స్ రచ్చ చేస్తున్నారు. అందరికి బిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ అమ్మడు స్విమ్మింగ్ పూల్ లో స్టైలిష్ బికినీతో అలరించింది.తెలుగు ప్రేక్షకులకు ఈమె మన్మధుడు 2 సినిమాతో పరిచయం అయ్యింది. కాని ఆ సినిమా నిరాశ పర్చడంతో మళ్లీ తెలుగులో కనిపించలేదు. ప్రస్తుతం ఈమె దృష్టి హిందీ మరియు కన్నడ సినిమాలపైనే ఉంది. తమిళంలో కూడా అవకాశాల కోసం తెలిసిన వారి ద్వారా ట్రై అయితే చేస్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక కన్నడ సినిమాతో పాటు ఒక తమిళ సినిమా ఉంది. తెలుగులో ఈమె మళ్లీ ఎంట్రీ ఇస్తుందా లేదా అంటే అనుమానమే అన్నట్లుగా మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్స్ దక్కించుకుంటే ఈమెకు ఏమైనా అవకాశాలు రావచ్చ అంటూ నెటిజ్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.