అక్కినేని ఫ్యాన్స్ మళ్లీ షాకిచ్చిన సమంత

Mon Sep 20 2021 23:15:30 GMT+0530 (IST)

Akkineni fans shocked again By Samantha

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యతో  సమంతకు చెడిందని.. వీరిద్దరూ విడిపోనున్నారని..విడాకులకు దరఖాస్తు చేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  దీనిపై అక్కినేని ఫ్యామిలీ కానీ.. సమంత నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం సమంత అటు నాగార్జునకు .. ఇటు భర్త నాగచైతన్యకు సంబంధించిన పోస్టులపై పాజిటివ్ గానే స్పందిస్తుండడం విశేషం.ఇటీవలే నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ ట్రైలర్ విడుదల కాగా.. దీనిపై సమంత తనదైన శైలిలో స్పందించింది. దీనికి నాగచైతన్య కూడా సోషల్ మీడియా సాక్షిగా సమంతకు 'థ్యాంక్స్' చెప్పడంతో వీరిద్దరి మధ్య విభేదాలు లేవని అనుకున్నారు.

ఇక తాజాగా నాగార్జున పోస్ట్ కు సమంత స్పందించింది. నేడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఈ సందర్భంగా హీరో నాగార్జున ఆయనకు నివాళులర్పిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ట్విట్టర్ ద్వారా స్పెషల్ వీడియోను షేర్ చేశాడు.

'సెప్టెంబర్ 20 తన జీవితంలో ముఖ్యమైన రోజు అని.. తన హీరో తన స్ఫూర్తి నాన్న గారి పుట్టినరోజు అని' తెలిపారు. నాన్నగారికి పంచెకట్టు అంటే చాలా ఇష్టమని.. ఆయన పంచ కట్టుకున్నప్పుడల్లా చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందన్నారు. ఆయనకు పొందురు ఖద్దరంటే చాలా ఇష్టమని.. తాను వేసుకున్నది కూడా పొందురు ఖద్దరే అని.. తను ధరించిన వస్తువులు కూడా నాన్న ఏఎన్నార్ వే అని నాగార్జున చెప్పుకొచ్చారు. నాన్న వాచ్ తన కంటే సీనియర్ అని తెలిపారు. ఈ వాచ్ పెట్టుకుంటే నాన్నే తన వెంట ఉన్నారని అనిపిస్తోందన్నారు. ఈ సందర్భంగా 'బంగర్రాజు' పోస్టర్ ను నాగార్జునపంచుకున్నారు. అందులో నాగ్ పంచెకట్టులో కనిపించారు.

ఈ వీడియోను చైతన్య కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా నాగార్జున పోస్ట్ను సమంత కూడా షేర్ చేసింది. 'నాగార్జున ఇది చాలా అందంగా ఉంది' అంటూ మొదట కామెంట్ చేసింది. ఎప్పుడూ 'మామ' అని సంబోధించే సమంత ఇలా కామెంట్ చేయడంతో అందరూ షాకయ్యారు. దీంతో వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేసిన సామ్.. మళ్లీ 'మామ' అంటూ కొత్త ట్వీట్ చేసింది. దీంతో మరోసారి వివాదం రాజుకుంది.