ఒకే ఫ్రేమ్ లో అక్కినేని ఫ్యామిలీ కానీ..

Mon May 16 2022 11:47:47 GMT+0530 (IST)

Akkineni family in a single frame But..

నచ్చిన హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో వుంటే ఫ్యాన్స్ ఆనందం మాటల్లో వర్ణించలేం. అదే నచ్చిన హీరో నటవారసులంతా తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి 'మనం' లాంటి ట్రీట్ ఇస్తే ఇంకే ముందు ఫ్యాన్స్ పండగే. అలాంటి పండగ లాంటి సర్ ప్రైజ్ ని అక్కినేని అభిమానులకు అందించారు యంగ్ హీరో సుశాంత్. వివరాల్లోకి వెళితే... టాలీవుడ్ లో వున్న క్రేజీ ఫ్యామిలీస్ నందమూరి ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ దగ్గుబాటి ఫ్యామిలీ. ఈ నాలుగు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన హీరోలు గత కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నారు.ఒక్కో ఫ్యామిలీ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు హీరోలుంటే అక్కినేని నందమూరి మెగా ఫ్యామిలీస్ నుంచి ఆ సంఖ్య భారీగానే వుంది. నందమూరి ఫ్యామిలీ నుంచి కేవలం ముగ్గురంటే ముగ్గురు హీరోలు బాలకృష్ణ ఎన్టీఆర్ కల్యాణ్ రామ్ మాత్రమే లైమ్ లైట్ లో స్టార్ లుగా వున్నారు. ఇక మెగా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే దాదాపు 10 మంది హీరోలు ఈ ఫ్యామిలీ నుంచే వుండటం విశేషం. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి ఐదుగురు హీరోలు లైన్ లో వున్నారు. అక్కినేని నాగార్జున నాగచైతన్య అఖిల్ సుమంత్ సుశాంత్. వీళ్లల్లో నాగార్జున నాగచైతన్య హీరోలుగా తమ సత్తాని చాటుతున్నారు.

అఖిల్ సుమంత్ సుశాంత్ ఇప్పటికీ స్టార్ డమ్ కోసం స్ట్రగుల్ చేస్తూనే వున్నారు. నాగార్జున 'ఘోస్ట్' మూవీతో బిజీగా వుండగా నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. అఖిల్ 'ఏజెంట్' సినిమా పనుల్లో బిజిబిజీగా గడిపేస్తున్నాడు.

సుమంత్ కూడా కొత్త సినిమాలతో ఫుల్ బిజీ. ఇక సుశాంత్ కూడా హీరోగా నటిస్తూనే కీలక పాత్రలలోనూ నటిస్తూ కొత్త జర్నీ మొదలు పెట్టాడు. ఇలా అక్కినేని హీరోలంతా బ్యాక్ టు బ్యాక్ బిజీగా వున్న వేళ వారంతా ఒకే ఫ్రేమ్ లో వున్న ఓ ఫొటోని హీరో సుశాంత్ తాజాగా షేర్ చేయడం అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

సుశాంత్ షేర్ చేసిన ఫ్యామిలీ ఫొటోలో అక్కినేని నాగార్జున ఆయన సోదరుడు వెంకట్ తనయుడు నాగచైతన్య సుమంత్ అమలతో పాటు నేటి తరానికి చెందిన వారు పెద్దవాళ్లు అంతా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు. ఒక్క అఖిల్ మాత్రం మిస్సింగ్ అంతే. అఖిల్ ప్రస్తుతం సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న 'ఏజెంట్' మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆ కారణంగానే అఖిల్ ఫ్యామిలీ గ్రూప్ ఫొటోలో కనిపించడం లేదు.

గతంలో ఇదే తరహలో సోషల్ మీడియాలో వైరల్ అయిన అక్కినేని ఫ్యామిలీ ఫొటోలో సమంత ప్రధానంగా కనిపించి సందడి చేసింది. కానీ తాజాగా షేర్ చేసిన ఫొటోలో సామ్ లేకపోవడం విడాకుల కారణంగా అక్కినేని ఫ్యామిలీకి నాగచైతన్యకు దూరం కావడం ఫ్యాన్స్ ని కొంత అంసృప్తికి గురిచేస్తోంది. సుశాంత్ షేర్ చేసిన తాజా ఫొటో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తూ వైరల్ గా మారింది.