బాలయ్య మాటపై పేలిన అక్కినేని తూటా!

Tue Jan 24 2023 14:22:21 GMT+0530 (India Standard Time)

Akkineni Naga Chaitanya And Akhil Reacts On Balayya Words

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ 'వీర సింహారెడ్డి'. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలిచింది. భారీ బ్లాక్‌బస్టర్ అనిపించుకోలేదు కానీ యావరేజ్ హిట్ అనిపించుకుంది. వసూల్లు పరంగానూ సినిమాకు మంచి టాక్ రావడం ఊహించిన ఫిగర్లని నమోదు చేసుకోవడంతో చిత్ర బృందం ఇటీవల విజయోత్సవంని హైదరాబాద్ లో నిర్వహించిన విషయం తెలిసిందే.  ఈ ఈవెంట్ లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ సింగర్స్ తో కలిసి పాటలు పాడుతూ హుషారుగా కనిపించారు. ఆ తరువాత మైక్ అందుకుని మాట్లాడటం మొదలు పెట్టిన బాలయ్య సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికి అభినందలు తెలియజేశారు.

అంతే కాకుండా తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్టేజ్ పై వున్న నిర్మాతలతో చతుర్లాడి నవ్వులు పూయించారు.

అక్కడితో ఆగని బాలయ్య స్టేజ్ సాక్షిగా టంగ్ స్లిప్పయ్యారు. ఎవరి గురించో మాట్లాడుతూ వెళ్లి ఈయన వున్నాడంటే సెట్ లో ఏదో ఒకటి.. అంటూ ఆ రోజుల్లో మీ నాన్నాగారి గురించి.. ఆ రంగారావు.. ఈ రంగారావు.. అక్కినేని.. తొక్కినేని..' అంటూ బ్లెండర్ పదాలని వాడారు.

బాలయ్య చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్ లు అక్కినేని ఫ్యాన్స్ ఘాటుగా విమర్శలు గుప్పిస్తూ ఏకి పారేస్తున్నారు. బాలయ్య కావాలనే అలా అన్నాడా?  లేక అనుకోకుండా ఆ మాటలు వచ్చాయా?.. నోరు జారడంవల్ల వచ్చాయా? అక్కినేని తొక్కినేని అని పెద్ద పడం వాడాడంటే ఏదో వుందని నాగార్జున ఏపీ సీఎం జగన్ కు సపోర్ట్ గా వుంటున్నారనే ఇలా అన్నాడా? అని ఇన్ సైడ్ టాక్.

ఇదిలా వుంటే బాలయ్య అన్న మాటలపై అక్కినే కాంపౌండ్ నుంచి తూటా పేలింది. 'నందమూరి తారకరామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం' అంటూ నాగచైతన్య అఖిల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించి బాలయ్య మాటలకు కౌంటర్ ఇచ్చారు. మరి ఈ వివాదం ఏ టర్న్ తీసుకుంటుందో అనే చర్చ వినిపిస్తున్నట్టుగా ఇండస్ట్రీ టాక్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.