పీకే-సుజిత్ ప్రాజెక్ట్ పై అకీరా నందన్ ఫీలింగ్ ఇది!

Wed Dec 07 2022 12:31:52 GMT+0530 (India Standard Time)

Akira Nandan's Feeling On The PK-Sujith Project!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో యంగ్ హీరో సుజిత్ ఓ సినిమా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఆ సినిమా ప్రారంభం కానుంది. ఇది నిజంగా అభిమానులు సహా అంతా షాక్  అయిన వార్తే. కనీసం గెస్ కూడా చేయని కాంబినేషన్ ఇది. అలాంటిది ఏకంగా అధికారిక ప్రకటనతోనే వచ్చేసి సర్ ప్రైజ్ చేసారు. ఇది ఇండస్ర్టీ సహా...అతన్ని ట్రోల్ చేసిన వారికి ఇచ్చిన అతి పెద్ద షాక్ గానే భావించాలి.`సాహో` తర్వాత సుజిత్ సోషల్ మీడియాలో ఎలాంటి విమర్శలు..ట్రోలింగ్ కి గురయ్యాడో తెలిసిందే. అప్పటి నుంచి సోషల్ మీడియాకే దూరమయ్యాడు. ఇప్పుడు ఏకంగా పవన్ తోనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా కోసం  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... డార్లింగ్ ప్రభాస్....మంచు మనోజ్ కూడా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.

కాంబో ప్రకటన రాగానే సోషల్ మీడియాలో విషెస్ తెలియజేసారు. యంగ్ హీరో అడవి శేషు కూడా అంతే ఎగ్జైట్  మెంట్ తో ఎదురు చూస్తున్నాడు. సుజిత్ అతడికి స్నేహితుడు కావడంతో మరింత ఎగ్జైట్ మెంట్కి గురవుతున్నట్లు తెలిపాడు. అలాగే ఈ కాంబినేషన్ లో సినిమా కోసం పవన్ కుమారుడు అకీరా నందన్ కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

`సాహో తర్వాత సుజీత్‌కి బాలీవుడ్ నుండి రెండు ఆఫర్లు వచ్చాయి. కానీ తెలుగు సినిమాలపై మక్కువతోనే ఇక్కడే సినిమాలు చేయాలన్న ఉద్దేశంతో వాటిని వదులుకున్నాడు. పవన్ ప్రాజెక్ట్ కి సంతకం చేయగానే నేనే అందరికీన్నా ఎక్కువ సంతోష పడ్డా.   నా అభిమాన నటుడితో సుజిత్ పనిచేయడం చాలా గర్వంగా ఫీలవుతున్నా` అన్నారు. మొత్తానికి ఇంట గెలిచి రచ్చ గెలావాలి అని సుజిత్ కమిట్ మెంట్ తో ఉన్నట్లు కనిపిస్తున్నాడు.

సుజిత్ డెబ్యూ `రన్ రాజా రన్` పెద్ద హిట్ అయింది. అటుపై భారీ అంచనా మధ్య తెరకెక్కించిన `సాహో` మాత్రం వైఫల్యం చెందింది. హిందీ మార్కెట్ లో పర్వాలేదనిపించింది. ఆ నమ్మకంతోనే సుజిత్ కి బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని తిరస్కరించినట్లు తెలుస్తోంది. మరి పీకేతో హిట్ కొట్టిన తర్వాత సక్సెస్ ఉత్సాహాంలో బాలీవుడ్ కి వెళ్తాడేమో చూడాలి.