అఖిల్4... అసలేం జరుగుతోంది?

Sun May 19 2019 14:30:56 GMT+0530 (IST)

అక్కినేని అఖిల్ పై అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నాడు. కాని మొదటి సినిమా 'అఖిల్' తో నిరాశ పర్చాడు ఆ తర్వాత హలో మరియు మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా అంతంత మాత్రంగానే ఆకట్టుకున్నాయి. మొదటి మూడు సినిమాలు నిరాశ పర్చినా కూడా అఖిల్ సినిమా కోసం ఇంకా అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖిల్ ఖచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. అఖిల్ ప్రస్తుతం 4వ సినిమాకు సిద్దం అవుతున్నాడు.అఖిల్ 4వ సినిమా ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రంను అల్లు అరవింద్ నిర్మించబోతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ అనగానే కాస్త అనుమానం ఉన్నా కూడా అల్లు అరవింద్ నిర్మాణంలో అవ్వడంతో ఖచ్చితంగా సినిమా బాగుంటుందని అనుకుంటున్నారు. ఈ చిత్రంతో అఖిల్ మొదటి సక్సెస్ ను దక్కించుకోవడం ఖాయం అనుకుంటున్న సమయంలో సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఫ్యాన్స్ ఓపికకు పరీక్ష పెడుతోంది.

సినిమా ఎప్పుడో ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా హీరోయిన్ ఎంపిక పూర్తి కాలేదు అంటూ ప్రారంభ తేదీని జరుపుతూ వచ్చారు. హీరోయిన్ ఎవరు అనే విషయంపై క్లారిటీ అయితే రాలేదు. కియారా అద్వానా లేదా రష్మిక మందన్నల్లో ఒకరు హీరోయిన్ గా చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో సినిమా కథ ఇంకా రెడీ అవ్వలేదనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కు చెందిన ముగ్గురు రచయితలు ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పై భాస్కర్ తో కలిసి వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అరవింద్ చెప్పిన మార్పులు చేర్పులు చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

స్క్రిప్ట్ రెడీ అయితే అతి త్వరలోనే సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది. హీరోయిన్ విషయంలో సినిమా ఆలస్యం అవుతుందనే విషయం ఏమాత్రం నిజం కాదనిపిస్తుంది. నాగార్జున తనయుడు అఖిల్ కు సక్సెస్ ఇవ్వాలనే పట్టుదలతో అల్లు అరవింద్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే కథ విషయంలో ఏమాత్రం లైట్ తీసుకోవడం లేదనిపిస్తుంది.