Begin typing your search above and press return to search.

కాస్త వెయిట్ పెరిగిన అక్కినేని బ్యాచిలర్

By:  Tupaki Desk   |   28 Feb 2020 10:30 AM GMT
కాస్త వెయిట్ పెరిగిన అక్కినేని బ్యాచిలర్
X
అఖిల్ అక్కినేని ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా లో హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్స్ కూడా రిలీజ్ చేశారు. షూ లేకుండా ఏదో ఫారెన్ లొకేషన్లో నడుస్తున్న అఖిల్.. మరో ఫస్ట్ లుక్ లో అఖిల్ షూ పట్టుకుని పోజిచ్చిన పూజా హెగ్డే అందరి దృష్టిని ఆకర్షించారు.

ఏప్రిల్ లోనే సినిమా రిలీజ్ కాబట్టి మార్చ్ రెండో వారం నుంచి ప్రమోషన్స్ లో జోరు పెంచాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే అఖిల్ ఈమధ్య ఎయిర్ పోర్ట్ దగ్గర కనిపించడంతో కెమెరాలు క్లిక్కుమన్నాయి. అఖిల్ ఈ ఫోటోలో కాస్త వెయిట్ పెరిగినట్టు కనిపిస్తున్నాడు. గతం లో అఖిల్ స్లిమ్ గా ఉండేవాడు. ఇప్పుడు కూడా ఫిట్ గా ఉన్నాడు కానీ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాలో పాత్రకు తగ్గట్టుగా కాస్త వెయిట్ పెరిగాడని అంటున్నారు. ఈ ఫోటోలో ఎప్పటిలాగే స్టైలిష్ గా ఉన్నాడు.

ఈ సినిమాకు గోపి సుందర్ సంగీత దర్శకుడు. ఈ సినిమా జీఎ 2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. అఖిల్ నటించిన మొదటి మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా అయినా అఖిల్ కు రిలీఫ్ ఇస్తుందా అనేది వేచి చూడాలి.