బ్యాచిలర్ 'ఏజెంట్' ఏం జరుగుతోందో చెప్పారు

Fri Oct 15 2021 23:00:01 GMT+0530 (IST)

Akhil appeared in the variety of stylish hairstyles

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖిల్ కు ఈ సినిమా మొదటి కమర్షియల్ సక్సెస్ ను తెచ్చి పెడుతుందని అభిమానులు మరియు అక్కినేని ఫ్యామిలీ చాలా నమ్మకంగా కనిపించారు. బ్యాచిలర్ సినిమా తర్వాత అఖిల్ చేస్తున్న సినిమా ఏజెంట్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందున్న ఏజెంట్ సినిమా లో అఖిల్ చాలా విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నాడు. అలాగే అతడి పాత్ర మరియు బాడీ లాంగ్వేజ్ చాలా వైవిధ్యభరితంగా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.ఏజెంట్ సినిమాను ప్రకటించి చాలా నెలలు అవుతుంది కాని ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. సినిమా ఏం జరుగుతుంది.. అసలు షూటింగ్ ప్రారంభం అయ్యిందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు ఈ సినిమా అసలు ఉందా ఏదైనా కారణంతో క్యాన్సిల్ అయ్యిందా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంకు ఏజెంట్ మేకర్స్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఏజెంట్ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది.. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు గాను షూటింగ్ ను స్పీడ్ గా చేస్తున్నట్లుగా తెలియజేశారు.

అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా కోసమే ఇటీవల మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా ప్రమోషన్ లో విభిన్నమైన స్టైలిష్ హెయిర్ స్టైల్ లో కనిపించాడు. అతడి హెయిర్ స్టైల్ గురించి పలువురు చర్చించడం జరిగింది. అఖిల్ ఏజెంట్ లుక్ కోసం సిక్స్ ప్యాక్ బాడీ ట్రై చేయడం మాత్రమే కాకుండా హెయిర్ స్టైల్ ను కూడా విభిన్నంగా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. షూటింగ్ ను చకచక పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాను అనీల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

అఖిల్ మొదటి సినిమాకు భారీగా ఖర్చు చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు అంతకు మించి ఏజెంట్ కోసం ఖర్చు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంపై నమ్మకంతో దాదాపుగా 50 కోట్లను అనీల్ ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. బ్యాచిలర్ కమర్షియల్ గా సక్సెస్ అయితే ఏజెంట్ కు ఖచ్చితంగా కలిసి వచ్చే అంశం అనడంలో సందేహం లేదు.