Begin typing your search above and press return to search.

బిబి4 : ఫినాలే మెడల్‌ కోసం అఖిల్‌.. సోహెల్‌ హోరాహోరీ

By:  Tupaki Desk   |   4 Dec 2020 4:45 AM GMT
బిబి4 : ఫినాలే మెడల్‌ కోసం అఖిల్‌.. సోహెల్‌ హోరాహోరీ
X
ఫినాలే మెడల్‌ టాస్క్‌ మూడవ రోజు కూడా కొనసాగింది. మొదటి రోజు పాల టాస్క్‌ లో విజేతలుగా నిలిచిన అభిజిత్‌, అఖిల్‌, హారిక, సోహెల్‌ లు రెండవ రౌండ్‌ కు వెళ్లారు. రెండవ రౌండ్‌ లో పూలను కలెక్ట్‌ చేయడంలో అఖిల్‌ మరియు సోహెల్‌ లు విజేతలుగా నిలిచి మూడవ రౌండ్‌ అయిన చివరి రౌండ్‌ కు వెళ్లారు. ఈ ఇద్దరు కూడా మంచి మిత్రులు అవ్వడం వల్ల టాస్క్‌ మరింత రసవత్తరంగా మారింది. ఇద్దరు అన్ని టాస్క్‌ ల్లో కూడా ఎప్పుడు గేవప్‌ ఇవ్వలేదు. ఈసారి కూడా అంతే. ఒక్క ఉయ్యాల మీద ఇద్దరు ఏకంగా 24 గంటలకు పైగా కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు. కాని ఇద్దరు కూడా మొండిగా కూర్చున్నారు.

ఊరికే కూర్చోవడం కాకుండా అక్కడ కూర్చుని బిగ్‌ బాస్‌ పంపే పాలు.. డ్రింగ్స్‌ తాగుతూ బాత్‌ రూంకు వెళ్లకుండా ఉండటం అంటే చిన్న విషయం కానే కాదు. టాయిలెట్‌ వచ్చినా కూడా అక్కడే చేశారు. అన్ని విధాలుగా ఊయాల వద్ద వారికి అభిజిత్‌ సాయంగా నిలిచాడు. ఇద్దరు కూడా మెడల్‌ కోసం పోరాడిన తీరు అద్బుతం అనవచ్చు. నేటి ఎపిసోడ్‌ లో కూడా కొంత సమయం అదే సీన్‌ టెలికాస్ట్‌ చేయబోతున్నారు. అఖిల్‌ ఈ టాస్క్‌ లో విజేతగా నిలిచినట్లుగా లీక్‌ అందుతోంది. ఊయల కిందకు దిగిన తర్వాత ఇద్దరు కూడా అభిజిత్‌ ను గట్టిగా హగ్‌ చేసుకుని ఏడ్వడం తో అసలు ఏం జరిగింది అంటూ ఆసక్తిని కనబర్చుతున్నారు.

నిన్నటి ఎపిసోడ్‌ లో కూడా మోనాల్‌ విషయంలో అభిజిత్‌ ఆవేశ పడ్డాడు. ఆమె విషయం రాగానే ఇంగ్లీష్‌ లో ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ సమయంలో హారిక ఇంగ్లీష్‌ వద్దు అంటూ అభిజిత్‌ ను వారించింది. అప్పుడు అభిజిత్‌ నువ్వు ఎందుకు నన్ను ఇంగ్లీష్‌ లో మాట్లాడవద్దంటూ అంటున్నావు. ఆ విషయంలో నేను ఎలా ఉంటానో నీకు తెలుసు కదా. ఇంగ్లీష్‌ లో మాట్లాడితే బిగ్‌ బాస్‌ చూసుకుంటాడు కదా అంటూ హారికపై కోపం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత హారిక వెళ్లి సారి చెప్పినా కూడా అభి కూల్‌ అవ్వలేదు. నేటి ఎపిసోడ్‌ రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తుంది.