భారీ యాక్షన్ సీన్ లో ఏజెంట్ కి గాయాలు?

Sun May 29 2022 11:01:09 GMT+0530 (IST)

Akhil Injures In A Massive Action Sence

కొండ కోనల్లో మహా పర్వతాల్లో మంచు కురిసే చోట యాక్షన్ విన్యాసాలు అంటే ఆషామాషీగా ఉంటుందా?  క్షణకాలంలోనే రిజల్ట్ తీవ్రంగా ఉంటుంది. చూస్తుంటే ఏజెంట్ కి అలాంటి సన్నివేశమే ఎదురైనట్టు కనిపిస్తోంది. అతడి ముఖంపై గాయాలయ్యాయి. చెవి చిట్లింది. ముక్కు ఒత్తుకుపోయింది.ముఖంపైనా బుగ్గలపైనా అక్కడక్కడా గాట్లు కనిపించాయి. మొత్తానికి యాక్షన్ సన్నివేశంలో ఏజెంట్ చాలా రిస్క్ చేసినట్టే అనిపిస్తోంది. ఏదైతేనేం ఇదంతా యాక్షన్ ప్రియులను అలరించేందుకు అక్కినేని అఖిల్ చేసిన రిస్క్ అని భావించాలి. ఇంటెన్స్ యాక్షన్ సీన్ కోసమే ఈ సాహసం అంటూ చిత్రబృందం కూడా వెల్లడించింది.

ఏజెంట్ మూవీ కోసం అఖిల్ శ్రమిస్తున్న తీరు చూస్తుంటే యాక్షన్ హీరోయిజాన్ని మరో లెవల్లో చూపిస్తున్నారని అర్థమవుతోంది. అఖిల్ మాన్ స్టర్ లుక్ లో కనిపించబోతున్నాడు. సాహసాలు థ్రిల్స్ తో సాగే స్పై కాన్సెప్ట్ కావడంతో ఏజెంట్ రాక కోసం ఇండస్ట్రీతో పాటు అభిమానులు ప్రజలు అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

ఏజెంట్ పనితనం ఎంతో కాస్త ఆగితే కానీ తెలీదు. బార్న్ సినిమా తరహాలో ఆద్యంత థ్రిల్స్ ఇచ్చే ఏజెంట్ కోసం మీడియా అభిమానులు అంతే ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అఖిల్-సురేందర్ రెడ్డి కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలని ఇండస్ట్రీ కూడా తహతహలాడుతోంది.

కాస్ట్యూమ్స్ మరో హైలైట్

ఇక ఏజెంట్ కోసం అఖిల్ ఎంపిక చేసుకుంటున్న కాస్ట్యూమ్స్ అంతే రిచ్ లుక్ తో ఆకట్టుకుంటున్నాయి. బ్రౌనిష్ జర్కిన్స్ .. మంచు కొండల్లో సంచారానికి తగ్గట్టు భారీ ఊల్ దుస్తులు ధరిస్తున్నాడు. పెరిగిన తన జుత్తుకు తగ్గట్టే కాస్ట్యూమ్ .. మేకప్ ప్రతిదీ సెట్ చేసారని తాజా ఫోటోలు చెబుతున్నాయి. ఏజెంట్  అఖిల్ కి పాన్ ఇండియా సినిమా అవుతుందని అంతా భావిస్తున్నారు. ఆగస్టు 12న ఈ మూవీ విడుదల కానుంది.