మిస్టర్ మజ్ను ఎవరో తెలిస్తే?

Thu Aug 09 2018 22:41:20 GMT+0530 (IST)

అక్కినేని అఖిల్ కెరీర్ మూడో సినిమా ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. తొలి ప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ సినిమా టైటిల్ ఏంటి? అన్నది లీక్ కాలేదు. ప్రస్తుతానికి `అఖిల్ 3` అని వ్యవహరిస్తున్నారు. సాధ్యమైనంత తొందర్లోనే టైటిల్ ని ప్రకటించనున్నారని తెలుస్తోంది.అఖిల్ - హలో .. ఈ రెండు టైటిల్స్ జనాల్లోకి బాగానే దూసుకెళ్లాయి. సినిమాల జయాపజయాల మాట ఎలా ఉన్నా..  టైటిల్స్ విషయంలో అఖిల్ ఎంతో కేర్ ఫుల్ గా ఉంటాడని అందరికీ అర్థమైంది. ఇక ట్రేడ్ లోనూ ఈ టైటిల్స్ పాజిటివ్ బజ్ నే క్రియేట్ చేశాయనడంలో సందేహం లేదు. అందుకే ఇప్పుడు మూడో సినిమాకి అంతే క్రేజీగా ఉండే టైటిల్ ని నిర్ణయించాలని డైరెక్టర్ వెంకీ అండ్ టీమ్ భావించారట. అందుకు తగ్గట్టే ఓ టైటిల్ ని కథ రెడీ చేసుకున్నాక అనుకున్నారట. ఆ టైటిల్ గుట్టు ఇంతవరకూ లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. సైలెంటుగా షూటింగ్ చేసేస్తున్నారు కాబట్టి మీడియాలోనూ  దీనిపై ఎలాంటి హడావుడి లేదు. స్పెక్యులేటెడ్ టైటిల్స్ కూడా వినిపించలేదు.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి టైటిల్ పిక్సయిందని తెలుస్తోంది. `మిస్టర్ మజ్ను` అనేది టైటిల్. ఇదివరకూ ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతలు ఈ టైటిల్ ని రిజిష్టర్ చేయించారట. దీనినిబట్టి కింగ్ నాగార్జున బ్లాక్‌బస్టర్ మూవీ `మజ్ను` టైటిల్‌ని అఖిల్ లాక్కున్నాడని క్లారిటీ వచ్చేసినట్టే. ఇదివరకూ ఈ టైటిల్ నాగచైతన్యకు అనుకున్నారు. ప్రేమమ్ టైమ్‌లో ఆ టైటిల్ బదులుగా ఈ టైటిల్ కొన్నాళ్లు పాపులరైంది. కానీ చివరికి ప్రేమమ్‌కే ఆ టీమ్ ఫిక్సయింది. మొత్తానికి అన్న వదులుకున్న టైటిల్ తమ్ముడికి వర్కవుటవుతోంది. ఇక `మిస్టర్ మజ్ను` టైటిల్‌ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 29 ఆగస్ట్ నాగార్జున బర్త్‌డే కాబట్టి ఆ రోజున చైతూ అఖిల్‌లకు సంబంధించిన అధికారిక ప్రకటనలు ఉంటాయి. అఖిల్ టైటిల్ ఆరోజే ప్రకటిస్తారని అక్కినేని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహకాల్లో ఉన్నారు.