'ఏజెంట్' బ్యాడ్ న్యూస్ అఫిషియల్..!

Sun Jun 26 2022 14:27:15 GMT+0530 (IST)

Akhil Akkineni Agent Movie

అక్కినేని హీరో అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్ సినిమా ఆగస్టు లో వస్తుందని అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా గత సంవత్సరం నుండి వాయిదాలు పడుతూ వస్తోంది. కరోనా వల్ల షూటింగ్ ఆలస్యం అవ్వడంతో సినిమాను అనుకున్న సమయంకు విడుదల చేయలేక పోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఆగస్టు లో విడుదల చేస్తామంటూ కొన్ని నెలల క్రితం అధికారికంగా డేట్ ఇచ్చినప్పటికి అది ఇప్పుడు మారబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న సాక్షి వైధ్య బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన ఏజెంట్ పోస్టర్ లో విడుదల తేదీ లేక పోవడంతో ఆగస్టు లో సినిమా విడుదల కావడం లేదనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేశారు.

తాజాగా ఆగస్టు లో సినిమాను విడుదల చేయడం లేదు అంటూ యూనిట్ సభ్యుల నుండి అఫిషియల్ గానే సమాచారం అందుతోంది. సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. షూటింగ్ అనుకున్నంత స్పీడ్ గా జరగక పోవడంతో పాటు కొన్ని అవాంతరాల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యిందట. సినిమా వాయిదా అనేది ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అయినా తప్పడం లేదంటున్నారు.

సినిమా మేకింగ్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నాడట. దర్శకుడు సురేందర్ రెడ్డి గత చిత్రాల ఫలితం నేపథ్యంలో ఈ సినిమా తప్పకుండా విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ కీలక పాత్రలో నటించడం తో తెలుగు తో పాటు తమిళం మరియు మలయాళంలో కూడా భారీ ఎత్తున విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారు. సినిమా విడుదల సమయంకు హిందీలో కూడా ఈ సినిమా ను ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. కాస్త ఆలస్యంగా వచ్చినా కూడా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకం ను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. కొత్త విడుదల తేదీని సెప్టెంబర్ 30 గా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.