ఏజెంట్ స్పీడ్ తగ్గింది.. టీజర్ వచ్చేది అప్పుడే?

Thu May 26 2022 10:05:10 GMT+0530 (IST)

Akhil Agent movie update

అక్కినేని హీరో అఖిల్ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అనుకోవడం లేదు. హీరోగా మొదటి మూడు సినిమాలు కూడా తీవ్రంగా నిరాశ పరిచిన ప్పటికీ నాలుగో సినిమాతో అయితే పరవాలేదు అనిపించాడు. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాక్సాఫీస్ వద్ద అయితే పర్వాలేదు అనిపించింది.కానీ అఖిల్ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. ఎలాగైనా మాస్ ఆడియెన్స్ ను మెప్పించి తన బాక్సాఫీస్ రేంజ్ ను పెంచుకోవాలి అని అనుకుంటున్నాడు. ప్రస్తుతం అతని ఫోకస్ మొత్తం కూడా ఏజెంట్ సినిమా పైన ఉంది.

హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ సినిమాలను పర్ఫెక్ట్ గా తెరకెక్కించ గల సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమాను కేవలం పోస్టర్స్ తోనే హైలెట్ చేశాడు. అఖిల్ కూడా తన ఫిట్నెస్తో షాక్ ఇచ్చాడు అని చెప్పాలి. అతని బాడీ లాంగ్వేజ్ ని కూడా మార్చుకోవడానికి పర్ఫెక్ట్ కంటెంట్ కూడా దొరికినట్లుగా తెలుస్తోంది. స్పై త్రిల్లర్ ఫిలిమ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు.

తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అనిపిస్తోంది ఇక ఈ సినిమా విడుదల తేదీపై సస్పెన్స్ కొత్త విషయం తెలిసిందే. సినిమాను ఆగస్టు 12వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ అప్పుడు సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకుని రెడీ అవుతుందా లేదా అనేది కాస్త అనుమానంగానే ఉంది. మరొకవైపు టీజర్ విషయంలో కూడా చిత్రయూనిట్ మరింత ఆలస్యం చేసే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది.

అసలైతే అఖిల్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడు కూడా విడుదల చేయలేదు. సినిమా విడుదల డేట్ డేట్ పై ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే టీజర్ ను విడుదల చేయాలని అనుకుంటున్నారు.

కనీసం మే నెలలో అయినా టీజర్ వస్తుందిని అనుకుంటే ఇప్పుడు కూడా రావడం లేదని తెలుస్తోంది. చిత్ర యూనిట్ సభ్యులు ఏజెంట్ టీజర్ ను జూన్ చివరలో లేదా జులై ఫస్ట్ వీక్ లోనే విడుదల చేస్తారని సమాచారం. ఇక సినిమా విడుదల తేదీ పై కొనసాగుతున్న సందేహాలకు కూడా చిత్ర యూనిట్ త్వరలోనే క్లారిటీ ఇవ్వడానికి రెడీ అవుతోంది