అఖిల్ 4 సినిమా లాంచ్ అయిందోచ్

Fri May 24 2019 15:07:03 GMT+0530 (IST)

అక్కినేని అభిమానులు చాలా రోజుల నుండి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖిల్ కొత్త సినిమా ఈరోజు లాంచ్ అయింది.  బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని జీఎ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్.. వాసువర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  జీఎ2  పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఐదవ చిత్రం ఇది.   ఈ చిత్రానికి వి.మనికందన్ సినిమాటోగ్రాఫర్.  గోపి సుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.  అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తారు. ఈ సినిమా లాంచ్ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున.. అమల.. అల్లు అరవింద్.. బన్నీ వాస్..  అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తదితరులు హాజరయ్యారు. ఈ లాంచ్ కార్యక్రమంలో అఖిల్ గెటప్ డిఫరెంట్ గా ఉంది.  కాస్త గడ్డం పెంచి కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా నటించనున్న హీరోయిన్.. ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

అఖిల్ నటించిన మొదటి మూడు సినిమాలు నిరాశపరచడంతో ఈసారి అన్ని ఆశలు ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. జీఎ2 పిక్చర్స్ బ్యానర్ అనగానే సక్సెస్ కు మారుపేరుగా ఉంది.  మరి ఈ అక్కినేని అబ్బాయికి గీతావారు మంచి హిట్ అందించి బ్రేక్ ఇస్తారేమో వేచి చూడాలి.