Begin typing your search above and press return to search.

యూఎస్ లో అఖండ అన్‌ స్టాపబుల్‌

By:  Tupaki Desk   |   4 Dec 2021 5:35 AM GMT
యూఎస్ లో అఖండ అన్‌ స్టాపబుల్‌
X
నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను లు అఖండ సినిమా తో హ్యాట్రిక్ దక్కించుకున్నట్లే.. మొదటి రెండు సినిమా లు ఏదో లక్కీగా సక్సెస్ అయ్యాయి అఖండ సినిమాకు అంత సీన్ ఉందా అనుకున్న వారి నోళ్లు మూయించడంతో పాటు వినయ విధేయ రామ సినిమా ప్లాప్ అయిన సమయంలో ట్రోల్స్ చేసిన వారికి అఖండ సినిమా తో సరైన సమాధానంను బోయపాటి ఇచ్చాడు. అఖండ సినిమా వసూళ్ల విషయంలో అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కుమ్మేస్తూనే ఉంది.

అద్బుతమైన వసూళ్లతో బయ్యర్లు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. అఖండ సినిమా యూఎస్ లో సాధిస్తున్న వసూళ్లు మామూలుగా లేవు. ప్రీమియర్ లతోనే మూడు లక్షల డాలర్లను దక్కించుకున్న అఖండ సినిమా అప్పుడే 5 లక్షల డాలర్ల మార్కను క్రాస్‌ చేసింది. అతి త్వరలోనే మిలియన్ మార్క్‌ ను క్రాస్ చేసి లాంగ్‌ రన్‌ లో 1.5 మిలియన్ ల వరకు రాబట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

యూఎస్ తో పాటు ఇతర దేశాల్లో కూడా అఖండ అన్ స్టాపబుల్‌ అన్నట్లుగా విడుదల అయిన రెండవ రోజు మూడవ రోజు కూడా హడావుడి కొనసాగుతోంది. వసూళ్ల పరంగా ఎప్పుడు చూడని నెంబర్స్ ను బాలయ్య అభిమానులు చూస్తున్నారు.

కరోనా తర్వాత ఇండస్ట్రీ ఇలాంటి నెంబర్స్ ను చూడటం జరగలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య అఖండ సినిమా అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నట్లుగా అభిమానులు ఆనందంగా ఉన్నారు.

బాలయ్య మరియు బోయపాటిల కాంబోకు అభిమానులు జే జే లు పలుకుతున్నారు. వారి యాక్షన్ మూడ్‌ ను మరింతగా పెంచేలా.. ప్రేక్షకులు కుర్చీ అంచున కూర్చునేలా బాలయ్య సినిమాకు థమన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చాడు.

అఖండ సినిమా లో బాలయ్య కు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ నటించగా.. పూర్ణ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. జగపతిబాబు మరియు శ్రీకాంత్‌ లు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు.

ముఖ్యంగా శ్రీకాంత్‌ ఈ సినిమా తో పూర్తి స్థాయి విలన్ గా గుర్తింపు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా తో అన్ని వర్గాల వారిని కూడా బాలయ్య ఎంటర్‌ టైన్‌ చేస్తున్నాడు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఈ సినిమాను చూసేందుకు వస్తున్నారని.. అందరికి కూడా నచ్చుతుందని యూనిట్‌ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య కు చాలా కాలం తర్వాత ఒక మంచి గట్టి కమర్షియల్‌ సక్సెస్ పడింది. బాలయ్య కెరీర్‌ లో ఈ సినిమా చాలా కీలకంగా నిలుస్తందనే నమ్మకం అందరు వ్యక్తం చేస్తున్నారు.