'అఖండ' స్పెషల్ పోస్టర్: నవ్వుతూ నడిచి వస్తున్న నటసింహం..!

Wed Jun 09 2021 17:00:00 GMT+0530 (IST)

Akhanda special poster

నటసింహ నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ''అఖండ''. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలయ్య ఫ్యాక్షనిస్ట్ గా అఘోరాగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ఉగాది కానుకగా టైటిల్ రోర్ పేరుతో వదిలిన టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో రేపు గురువారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులను ఖుషీ చేయడానికి.. ఒకరోజు ముందుగానే సరికొత్త 'అఖండ' పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేసింది.బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలుపుతూ రిలీజ్ చేసిన 'అఖండ' న్యూ పోస్టర్ లో నటసింహ నవ్వుతూ స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తున్నాడు. కలర్ ఫుల్ గా ఉన్న బ్యాగ్రౌండ్ చూస్తుంటే ఇది సెలబ్రేషన్ మూడ్ లో వచ్చే సాంగ్ లోదని అర్థం అవుతోంది. దీన్ని చూసిన అభిమానులు నటసింహం నవ్వితే ఇలాగే ఉంటుందని కామెంట్స్ చేస్తూ.. ఈ పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా 'అఖండ' చిత్రంతో శ్రీకాంత్ - జగపతిబాబు - పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు - తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 'సింహా' 'లెజెండ్' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న 'అఖండ' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.