అమెరికాలో `అఖండ` హాఫ్ మిలియన్ మార్క్

Fri Dec 03 2021 20:30:35 GMT+0530 (IST)

Akhanda half million mark in America

నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన `అఖండ` బాక్సాఫీస్ వద్ద అసాధారణ ఓపెనింగ్ వసూళ్లను సాధిస్తోంది. అత్యంత భారీగా రిలీజైన ఈ చిత్రానికి తొలిరోజు ఇంటా బయటా అద్భుత వసూళ్లు దక్కాయి. ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ మార్క్ కి చేరుకుంది ఈ చిత్రం.`అఖండ` ప్రీమియర్ షోల రూపంలో 332కె డాలర్లను వసూలు చేయగా.. 2021లో అమెరికా టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఇది మొదటి రోజు ఈ ఏడాదిలో యుఎస్ మార్కెట్ లో రికార్డ్. మొదటి రోజు 130 కె గ్రాస్ తో అఖండ మొత్తం 462 కె వద్ద హాఫ్ మిలియన్ కి చేరుకుంది. ఈ సంవత్సరంలో అమెరికాలో తెలుగు సినిమాకి ఇదే అత్యధిక డే వన్ వసూళ్ల రికార్డ్.

తొలి వారంలో `అఖండ` భారీ వసూళ్లకు ఆస్కారం ఏర్పడింది. శని- ఆదివారాలు పటిష్టంగా ఉంటాయని అంచనా. ఓ మాస్ ఎంటర్ టైనర్ కి ఓవర్సీస్ లో ఇంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం నిజంగా విశేషం కాగా.. మునుముందు ఈ వసూళ్ల రికార్డు మరింతగా కనిపించనుందని అంచనా. అమెరికాలో బాలయ్య అభిమానులు మునుపెన్నడూ లేనంతగా బాలయ్య సినిమాకి జోష్ ని నింపుతున్నారు.