గ్రామంలో 'అఖండ' ప్రదర్శన.. పోటెత్తిన జనం!

Tue Jan 25 2022 10:52:27 GMT+0530 (IST)

Akhanda exhibition in the village

నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయుడిగా నటించిన `అఖండ` డిసెంబర్లో రిలీజ్ అయి ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఎన్.బి.కే కెరీర్ లో తొలి 100 కోట్ల క్లబ్ చిత్రమిది. బాలయ్య- బోయపాటి జోడీ అఖండ సక్సెస్ తో హాట్రిక్ అందుకుని మరోసారి బాక్సాఫీస్ వద్ద అపజయమెరగని కాంబినేషన్ అని నిరూపించారు. బాలయ్య ద్విపాత్రాభినం... అఖండ రోల్ ప్రత్యేకతతో సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇక ఓటీటీలోనూ అఖండ దూకుడు చూపించింది. రిలీజ్  అయిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసింది. కొన్నిచోట్ల మహిళా ప్రేక్షకులు థియేటకు ఏకంగా ట్రాకర్టపై  తరలి వచ్చి సినిమా చూసారంటే అఖండ విజయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.పాత రోజుల్లో ఎడ్ల బళ్లపై సినిమాలు చూడటానికి వచ్చేవారు. మళ్లీ అలాంటి సన్నివేశాన్ని `అఖండ`తో రిపీటైంది. `అఖండ` ఏ స్థాయిలో ప్రేక్షకులకు రీచ్ అయిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ సినిమా మరో సంచలన సృష్టించింది. `అఖండ` చిత్రాన్ని వీధిలో తెరపై వేసుకుని గ్రామస్థులు అంతా కలిసి చడటం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామంలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. సరిగ్గా ఊరు చివరన వాటర్ ట్యాంక్ సమీపాన బహిరంగ ప్రదేశంలో  తెరను ఏర్పాటు చేసుకుని ఆ గ్రామ ప్రజలంతా `అఖండ` చిత్రాన్ని ఇలా  వీక్షిస్తున్నారు. ఈ సన్నివేశం చూస్తుంటే మళ్లీ పాత రోజులను గుర్తు చేసింది. నాడు ప్రతి ఆదివారం గ్రామ వీధుల్లో రూ.2 టికెట్ తో సినిమాలు ఆడించిన రోజుల్ని తిరిగి గుర్తు చేసుకోవాల్సి వచ్చింది.

సరిగ్గా రెండు దశాబ్ధాల క్రితం..

చిరంజీవి..బాలకృష్ణ..వెంకటేష్..నాగార్జున సినిమాల్ని గ్రామాస్తులు ఇలాగే  వీక్షించేవారు. పండగల సమయంలో అభిమానులు తమ అభిమాన హీరో సినిమాలను తెరపై వేసేవారు. అలాగే కొత్త సినిమాల రిలీజ్ సమయంలోనూ ఇలాగే పాత సినిమాల్ని వీధి తెరలపై వేసేవారు. దీనికి టికెట్ డబ్బు వసూలు చేసేవారు. మళ్లీ ఇంత కాలానికి అఖండ కారణంగా పాత రోజుల్ని నెమరు వేసుకుంటున్నారు. ఏది ఏమైనా బాలయ్య లెక్క వేరు. ట్రాక్టర్లపై జనాల్ని రప్పించాలన్న.. వీధి తెరపై బొమ్మ పడాలన్నా బాలయ్య దిగాల్సిందేనని ప్రూవైంది. నందమూరి నటసింహమా మజాకానా!