Begin typing your search above and press return to search.

బాహుబలి తర్వాత మళ్లీ 'అఖండ' కు 50 డేస్‌ ఘనత

By:  Tupaki Desk   |   19 Jan 2022 11:32 AM GMT
బాహుబలి తర్వాత మళ్లీ అఖండ కు 50 డేస్‌ ఘనత
X
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వంద కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్న అఖండ సినిమా మరో అరుదైన రికార్డుకు చేరువ అయ్యింది. గత దశాబ్ద కాలంగా సినిమాలు 50 రోజులు.. 100 రోజులు ఆడటం అనేదే జరగడం లేదు. ఈ పదేళ్ల లో 50 డేస్ ఆడిన సినిమాల జాబితా ను తీస్తే వేళ్ల మీద లెక్కించవచ్చు. వంద రోజులు పూర్తి చేసుకున్న సినిమాలు అయితే లేనే లేవు. ఈ మధ్య వచ్చిన సినిమాలన్నీ కూడా రెండు మూడు వారాల్లోనే వసూళ్లు సాధించినవే.. ప్రతి సినిమా కూడా రెండు మూడు వారాలు థియేటర్‌ లో ఉంటేనే గొప్ప విషయం అన్నట్లుగా ప్రస్తుత పపరిస్థితులు ఉన్నాయి. వందల థియేటర్లలో సినిమాలు విడుదల చేయడం రెండు మూడు వారాల్లోనే కలెక్షన్స్ ను రాబట్టుకోవడం చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో అఖండ సినిమా 50 రోజుల అరుదైన రికార్డు దక్కించుకోబోతుంది. దాదాపుగా 25 సెంటర్లలో అఖండ నేరుగా 50 రోజులు ఆడుతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. బాహుబలి తర్వాత మళ్లీ 50 రోజులు ఈ స్థాయి థియేటర్లలో పూర్తి చేసుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది అఖండ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అఖండ సినిమా కు కరోనా థర్డ్‌ వేవ్‌ కలిసి వచ్చి 50 రోజుల రికార్డు దక్కుతుంది అని నిపుణులు చెబుతున్నారు. సంక్రాంతికి రావాల్సిన సినిమాలు కరోనా థర్డ్‌ వేవ్‌ వల్ల విడుదల అవ్వలేదు. కనుక అఖండ సినిమా లు అలాగే కంటిన్యూ అయ్యాయి.

బాలయ్య మరియు బోయపాటిల కాంబోలో వచ్చిన సింహా మరియు లెజెండ్‌ సినిమా లు భారీ విజయాలన్ని సొంతం చేసుకున్నాయి. మళ్లీ వీరి కాంబోలో అఖండ సినిమా టైటిల్ కు తగ్గట్లుగా నే అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. అఖండ సినిమా లో బాలయ్య ద్విపాత్రాభినయం చేయడం తో అభిమానులు సూపర్‌ హిట్ గా అఖండను చేయడం జరిగింది. అఖండ లో బాలయ్య కు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ నటించింది. పూర్ణ కీలక పాత్రలో కనిపించింది.

శ్రీకాంత్‌ ఈ సినిమా లో మెయిన్ విలన్ గా నటించాడు. ఈ సినిమా 50 రోజులు పూర్తి అయిన తర్వాత సినిమా ను హాట్ స్టార్‌ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. 50 రోజుల రికార్డ్‌ కోసం హాట్‌ స్టార్ లో స్ట్రీమింగ్‌ వాయిదా వేసినట్లుగా సమాచారం అందుతోంది. ఏదో విధంగా అఖండ సినిమా ను 50 డేస్ ను పూర్తి చేసుకునేలా చేశారు. మొత్తానికి బాలయ్య లక్ తో అరుదైన రికార్డును దక్కించుకున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కామెంట్స్ చేస్తున్నారు.