`అఖండ` బ్రేక్ ఈవెన్..బాలయ్యా.. మజాకానా !

Sun Dec 05 2021 23:00:01 GMT+0530 (IST)

Akhanda Movie Break Even

నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన `అఖండ` బాక్సాఫీస్ ని షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. రివ్యూలు నెగిటివ్ వచ్చినా వాటితో సంబంధం లేకుండా బాలయ్య ఇమేజ్ తో `అఖండ` అన్ స్టాపబుల్ గా దూసుకుపోతోంది. బాలయ్య-బోయపాటి కాంబో సెంటిమెంట్ మరోసారి బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన అఖండ ఏ మాత్రం నిరాశపరచకుండా విజయ ఢంకా మోగించింది. రోరింగ్ హిట్ అంటూ మరోవైపు టీమ్ పోస్టర్లు వేసి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేస్తోంది. తెలుగు రాష్ర్టాల్లో సినిమా  భారీ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.ఇక నైజాంలో  ఈసినిమా 4.4 కోట్లు.. తొలి  రెండు రోజుల్లో 2.2 కోట్లు. మూడవ రోజు 2.5 కోట్ల షేర్ సాధించింది. మొత్తంగా ఇప్పటివరకూ 9.10 కోట్లు షేర్ తెచ్చింది. ఈరోజు వసూళ్లతో బ్రేక్ ఈవెన్  మార్క్ ని చేరుకోనుంది. ఇంకా వరల్డ్ వైడ్ వసూళ్లు లెక్క తేలాల్సి ఉంది.  కోవిడ్ సమయంలో విడుదలైన తొలి అగ్ర హీరో సినిమా కావడం విశేషం. ఇక ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడంతో మిగతా సినిమాలకు లైన్ క్లియర్  చేసింది. మరో కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పురుడు పోసుకుని భారత్ లో సైతం కేసులు నమోదవుతోన్నబాలయ్య ముందు కంటికి కనిపించని వైరస్ ఎంత? అన్న చందంగా సన్నివేశం కనిపిస్తోంది.

డిసెంబర్ 2 న రిలీజ్ అయిన సినిమా నాలుగు రోజులుగా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్నింగ్ లో ఉందంటే వైరస్ ని జనాలు ఎంత లైట్ తీసుకున్నారో? అర్ధమవుతుంది. మొత్తానికి బాలయ్య బాబు జోష్ పెంచారు. లెజెండ్ తర్వాత బాలయ్యకి సరైన హిట్ పడని సంగతి తెలిసిందే. అలాగే బోయపాటి సినిమాలు సరైన ఫలితాలు సాధించలేదు. ఆ లెక్కలన్నింటిని అఖండ సెట్ చేసినట్లే భావించవచ్చు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన సంగతి తెలిసిందే.