Begin typing your search above and press return to search.

బాలయ్య రూటే కరెక్ట్... ?

By:  Tupaki Desk   |   3 Dec 2021 4:30 PM GMT
బాలయ్య రూటే కరెక్ట్... ?
X
తెలుగు చలన చిత్ర సీమలో సీనియర్ హీరోల్లో బాలయ్య ఒకరు. ఆయనకు నటన తెలుసు. బిజినెస్ వ్యవహారాలు, ముహూర్తాలు లెక్కలు ఇవన్నీ అసలు తెలియవు. తన సినిమా పూర్తి అయితే రిలీజ్ చేయడమే తప్ప బెస్ట్ సీజన్ల కోసం చూడరు, సంక్రాంతులు, దసరాలు, సమ్మర్ వెకేషన్స్ అంటూ వెయిట్ చేయరు, డేట్స్ లాక్ చేసి మూవీ ఫేట్ ని మార్చేయాలనుకోరు. బాలయ్య అంటే బోళా. ఆయన ప్రొఫెషనల్ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. అందుకే ఆయనకు ఎపుడూ పెద్దగా ఇబ్బందులు రావు. ఆయన ఎంత స్వచ్చంగా ఉంటారో సక్సెస్ కూడా అంత గ్రాండియర్ గా వచ్చి పలకరిస్తుంది.

ఇపుడు కూడా అదే జరిగింది. అఖండ రూపంలో భారీ సక్సెస్ ని బాలయ్య కొట్టేశారు. తొలి రోజు కలెక్షన్లే గట్టిగానే గర్జించాయి. 53 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింతే ఆల్ ఓవర్ ఇండియార్, ఓవర్సీస్ కలుపుకుని 29 కోట్ల దాకా ఫస్ట్ డే కలెక్షన్లు వచ్చాయి అంటే బాలయ్య బొమ్మ ఇరగదీసిందనే చెప్పాలి. ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ పాయింట్ కి అఖండ ఈజీగా చేరుకుంటుదని, మండే నుంచి వచ్చేవి ప్రాఫిట్స్ మాత్రమే అని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే బాలయ్య డిసెంబర్ 2న అఖండ రిలీజ్ చేశారు. నిజానికి ఈ టైమ్ ని డ్రై సీజన్ గా చూస్తారు. డిసెంబర్ లో రిలీజ్ అంటే క్రిస్మస్ కి వారం ముందు మాత్రమే బెస్ట్ సీజన్ గా టాలీవుడ్ ట్రేడ్ లెక్కలు చెబుతాయి. కానీ ఏ ఒక్క సెలవూ లేని కంప్లీట్ డ్రై సీజన్ లో బాలయ్య మూవీని రిలీజ్ చేశారు. అది కూడా టికెట్ల లెక్క ఏపీలో ఏమీ తేలలేదు. బెనిఫిట్ షోలకు ఆంక్షలు పెట్టేశారు.

అయినా సరే అఖండ దుమ్ము లేపాడు, బాలయ్య స్టారిజం తోనే ఈ సాహసం చేసి అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాడు. అంతే కాదు, రెండేళ్లుగా అతి పెద్ద హిట్ లేని టాలీవుడ్ కళ్ళలో ఆనందం నింపాడు వెనకాల వచ్చే సినిమాలకు బోలెడు ధైర్యాన్ని ఇచ్చాడు. ఇదిలా ఉంటే బాలయ్య లెక్క కరెక్టే అని అఖండ రిలీజ్ చెబుతోంది. ఎందుకంటే ఒక వైపు ప్రపంచాన్ని ఒమిక్రాన్ రూపంలో కొత్త కరనా వేరియంట్ భయం పట్టిపీడిస్తోంది. మళ్లీ లాక్ డౌన్లు అంటారా లేక కొత్త కండిషన్లు పెడతారా అన్న టెన్షన్ అయితే టాలీవుడ్ కి ఉంది.

ఈ నేపధ్యంలో డిసెంబర్ ఇపుడు సేఫెస్ట్ మంత్ గానే మిగిలింది. వస్తే గిస్తే ఒమిక్రాన్ ఆంక్షలు అన్నీ కూడా కొత్త ఇయర్ లోనే గట్టిగా ఉండబోతాయి అంటున్నారు. బాలయ్య అఖండ తో హిట్ కొట్టి మంచి పని చేశారు అంటున్నారు. నిజానికి ఈ ఏడాది సెకండ్ వేవ్ ముగిసిన తరువాత ఆగస్ట్ నుంచి అంతా మంచిగానే ఉంది. చాలా పెద్ద సినిమాలు కూడా పూర్తి చేసుకుని మరీ సీజన్ల కోసం చూశారు. ఇపుడు ఆ సీజన్లే బ్యాడ్ చేస్తాయా, ఒమిక్రాన్ కొంప ముంచబోతోందా అన్న టెన్షన్ అయితే టాలీవుడ్ లో ఉంది. మొత్తానికి ఒమిక్రాన్ గండం టాలీవుడ్ కే కాదు, ప్రపంచానికి ఉండకూడదని అంతా వేయి దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు.