Begin typing your search above and press return to search.

డేస్ గడుస్తున్న అఖండ 'అన్ స్టాపబుల్‌'

By:  Tupaki Desk   |   5 Dec 2021 4:17 AM GMT
డేస్ గడుస్తున్న అఖండ అన్ స్టాపబుల్‌
X
బాలకృష్ణ.. బోయపాటిల కాంబోలో రూపొందిన అఖండ సినిమా డిసెంబర్‌ 2వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింహా మరియు లెజెండ్‌ సినిమాల తర్వాత వీరి కాంబోలో వచ్చిన సినిమా కావడం వల్ల అభిమానులు ఖచ్చితంగా హ్యాట్రిక్ అంటూ మొదటి నుండి అనుకున్నారు. అనుకున్నట్లుగానే అఖండ విజయాన్ని ఈ సినిమా దక్కించుకుంది. మొదటి రోజు వసూళ్ల జాతక కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా యూఎస్‌.. ఆస్ట్రేలియా మరియు కర్ణాటకలో కూడా ఈ సినిమా వసూళ్లు ఓ రేంజ్ లో నమోదు అయ్యాయి. రెండవ రోజు శుక్రవారం ఈ సినిమా కు వసూళ్లు ఎలా ఉంటాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అనూహ్యంగా సినిమా రెండవ రోజు కూడా వసూళ్లు భారీగా నమోదు అయ్యాయి.

ఇక వీకెండ్‌ అవ్వడం వల్ల శనివారం కూడా అఖండ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక ఆదివారం అవ్వడంతో నాల్గవ రోజు కూడా భారీ వసూళ్లు నమోదు అవ్వబోతున్నాయి. మొత్తానికి మొదటి నాలుగు రోజుల్లో అఖండ వసూళ్లు అన్‌ స్టాపబుల్‌ అన్నట్లుగా వస్తున్నాయి. ఆది వారం వరకు కంటిన్యూస్‌ గా వసూళ్లు నమోదు అవుతూనే ఉంటాయని అభిమానులు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నాలుగు రోజులు ఈ సినిమా భారీ వసూళ్లను దక్కించుకుంటే లాంగ్ రన్ లో మరింతగా వసూళ్లు ఉంటాయని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. బాలయ్య కెరీర్‌ లోనే అత్యధిక ఓపెనింగ్స్ దక్కించుకున్న సినిమా గా అఖండ నిలుస్తుంది. అన్ని ఏరియాల్లో కూడా బాలయ్య తన రికార్డును తాను బ్రేక్ చేశాడు. కరోనా తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు మాత్రమే ఈ రేంజ్ వసూళ్లు నమోదు చేశాయి. ఈ ఏడాదిలో టాప్ ఇండియన్‌ సినిమాల జాబితాలో అఖండ నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.

అఖండ లో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించాడు. రెండు పాత్రలకు కూడా ఆయన పూర్తి న్యాయం చేసే విధంగా నటించాడంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పూర్ణ కీలక పాత్రలో నటించింది. ఇంకా కీలక పాత్రల్లో శ్రీకాంత్‌.. జగపతిబాబు లు కనిపించారు. శ్రీకాంత్ మొదటి సారి విలన్ గా కనిపించిన నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. బాలయ్య మరియు బోయపాటి కాంబో హ్యాట్రిక్ దక్కించుకోవడంతో వీరి కాంబోలో తదుపరి సినిమా కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నామని చెబుతున్నారు. బాలయ్య ను అభిమానులు ఎలా చూడాలని ఆశిస్తున్నారో బోయపాటికి బాగా తెలుసు. అందుకే వరుస సక్సెస్ లు నమోదు అవుతున్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.