మార్చి 1ని `రొమాంటిక్` డేగా ప్రకటించిన ఆకాష్ పూరి

Sun Feb 28 2021 11:12:04 GMT+0530 (IST)

Akash Puri declares March 1 as 'Romantic' Day

ఆకాశ్ పూరి కథానాయకుడిగా నటిస్తున్న రెండో చిత్రం రొమాంటిక్. అనీల్ పూడూరి దర్శకుడు. పూరి కనెక్ట్స్ పతాకంపై లావణ్య సమర్పణలో ఈ మూవీని చార్మి- పూరి ద్వయం స్వయంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా రెండేళ్లుగా సెట్స్ పైనే ఉంది. రకరకాల కారణాలతో ఈ మూవీ రిలీజ్ కి బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఇంతకుముందు గోవా  పరిసరాల్లోనూ రొమాంటిక్ కీలక షెడ్యూల్ ని చిత్రీకరించినపుడు ఛార్మి కౌర్ అప్ డేట్స్ అందించారు.ఇప్పటికే రొమాంటిక్ టైటిల్ ని జస్టిఫై చేస్తూ వేడెక్కించే పోస్టర్లను రిలీజ్ చేశారు పూరి బృందం. అవన్నీ టీనేజర్లకు ఇట్టే కనెక్టయిపోయాయి. పూరి మార్క్ రొమాన్స్ డెప్త్ ఇన్ లవ్ తెరపై కనిపిస్తాయని అప్పుడే అంచనా వేసారు. ఇక ఈ మూవీలో ఆకాశ్ సరసన కేతిక శర్మ అనే కొత్తమ్మాయ్ నటిస్తోంది. అలాగే వెటరన్ నటి రమాప్రభ ఇందులో ఓ కీలక పాత్రను పోషించగా మకరంద్ దేశ్ పాండే-మందిరా ఆసక్తికర పాత్రల్లో కనిపించనున్నారు.

2018 ప్రథమార్థంలో `మెహబూబా` లాంటి ప్రయత్నం విఫలమైనా నటుడిగా మంచి మార్కులే వేయించుకున్నాడు కాబట్టి రెండో ప్రయత్నం మాత్రం ష్యూర్ షాట్‌గా హిట్ కొట్టాలన్న పంతంతో ఆకాష్ పూరి ఉన్నాడు. తాజాగా చిత్రబృందం రొమాంటిక్ రిలీజ్ తేదీని వెల్లడించేందుకు సిద్ధమవుతోంది. మార్చి 1న 10ఏఎం ఈ మూవీ టైటిల్ ని ప్రకటిస్తామని పోస్టర్ ని రివీల్ చేశారు.