ఆహాలో పూరి మోస్ట్ 'రొమాంటిక్' స్ట్రీమింగ్

Thu Nov 25 2021 15:32:31 GMT+0530 (IST)

Akash Puri Romantic To Stream On Aha From Nov 26

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ మూవీ ఇటీవలే థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ ను దక్కించుకున్న రొమాంటిక్ మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ఆకాష్ పూరికి ఈ సినిమా మొదటి కమర్షియల్ సక్సెస్ గా బాక్సాఫీస్ వర్గాల వారు చెప్పుకొచ్చారు. పూరి జగన్నాద్.. విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ వల్ల ఈ సినిమాకు భారీగా పబ్లిసిటీ దక్కింది. దాంతో ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. లాంగ్ రన్ లో కూడా మంచి వసూళ్లను నమోదు చేసుకున్న రొమాంటిక్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. మరోసారి ప్రేక్షకులను రొమాన్స్ లో ముంచెత్తేందుకు రొమాంటిక్ సినిమా ఆహా లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.ఈమద్య కాలంలో వరుసగా ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు మంచి వ్యూస్.. రన్ టైమ్ ను దక్కించుకుంటున్నాయి. వారం వారం సూపర్ హిట్ సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్న ఆహా వారు ఈ వారం అంటే ఈనెల 26వ తారీకున రొమాంటిక్ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను ఆహా లో అత్యధికులు చూడబోతున్నట్లుగా తెలుస్తోంది. యూత్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారికి కనెక్ట్ అయ్యేలా ఉన్న రొమాంటిక్ సినిమా ను ఆహా ప్రేక్షకులకు ఖచ్చితంగా మంచి ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

ఆకాష్ కు జోడీగా కేతిక శర్మ శర్మ హీరోయిన్ గా నటించింది. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించింది. అనీల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా కు కథ మరియు స్క్రీన్ ప్లే తో పాటు డైలాగ్స్ ను కూడా పూరి జగన్నాధ్ అందించాడు. పూరితో కలిసి ఛార్మి ఈ సినిమాను నిర్మించింది. రొమాంటిక్ సినిమా పూరి మార్క్ మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటుంది. ముఖ్యంగా హీరో మరియు హీరోయిన్ ల మద్య ఉండే లవ్ కమ్ రొమాంటిక్ సన్నివేశాలు ఈతరం యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయంటూ రివ్యూలు వచ్చాయి. పాజిటివ్ రివ్యూలను దక్కించుకున్న రొమాంటిక్ ఆహా స్ట్రీమింగ్ తో మరింతగా ప్రేక్షకులకు చేరువ అవ్వడం ఖాయం.