Begin typing your search above and press return to search.

హిందీ 'ఖైదీ'లో కాజోల్‌ ను ఇరికిస్తున్నారు

By:  Tupaki Desk   |   19 Oct 2020 6:00 AM GMT
హిందీ ఖైదీలో కాజోల్‌ ను ఇరికిస్తున్నారు
X
తమిళంలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఖైదీ సినిమాను హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఒరిజినల్‌ వర్షన్‌ కు లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించగా కార్తీ హీరోగా నటించాడు. సినిమా కథ నేపథ్యంలో హీరోయిన్‌ ఎవరు లేరు. సినిమాలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అనేవి ఉండవు. అయినా కూడా సినిమా మంచి విజయం సాధించింది. అదే ఈ సినిమాలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటే మరింతగా ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకునేది అంటూ అప్పట్లో కొందరు కామెంట్స్‌ చేశారు. అందుకే హిందీ ఖైదీ కి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ని జోడిస్తున్నారట.

తమిళ ఖైదీ స్క్రీప్ట్‌ లో పలు మార్పులు చేర్పులు చేసి కమర్షియల్‌ గా ఉండేలా చేశారట. హీరోగా నటించబోతున్న అజయ్‌ దేవగన్‌ కోసం జోడీగా కాజోల్‌ ను ఎంపిక చేయడం జరిగిందట. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లాక్‌ డౌన్‌ కారణంగా ఆలస్యం అయిన ఈ సినిమాను డిసెంబర్‌ లో పట్టాలెక్కించి ఏకధాటిగా షూటింగ్‌ జరిపి సింగిల్‌ షెడ్యూల్‌ లో సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్‌ చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్‌ భావిస్తున్నారట. కాజోల్‌ మరియు అజయ్‌ దేవగన్‌ ల కాంబోకు ఖచ్చితంగా మంచి మార్కులు పడుతాయనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.