స్టార్ హీరో స్పోర్ట్స్ డ్రామా వచ్చేది అప్పుడే...!

Mon Jul 06 2020 07:00:01 GMT+0530 (IST)

Ajay Devgn Maidaan Movie Release Date

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న మూవీ 'మైదాన్'. ఫుట్ బాల్ క్రీడకి విపరీతమైన క్రేజ్ ఉన్న 1952 - 62 మధ్య కాలంలో.. భారత ఫుట్ బాల్ ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. 'బదాయి హో' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ ప్రియమణి 'మైదాన్' లో హీరోయిన్ గా నటిస్తోంది. పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ గజరాజ్ రావు ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ సినిమాని 2021 ఆగస్టు 13న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు అజయ్ దేవగణ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.అజయ్ దేవగన్ ట్వీట్ చేస్తూ.. ''2021 ఇండిపెండెన్స్ వీక్. ఇప్పటి వరకూ చెప్పని.. ప్రతి ఇండియన్ గర్వపడే స్టోరీ ఇది. ఆగస్టు 13వ తేదీని మార్క్ చేసి పెట్టుకోండి'' అని పేర్కొన్నారు. క్రీడా నేపథ్యంలో ఉన్న సినిమాలకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉండటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 'మైదాన్' మూవీని ఫ్రెష్ లైమ్ ఫిల్మ్ సహకారంతో జీ స్టూడియోస్ బ్యానర్ పై బోనీ కపూర్ - ఆకాష్ చావ్లా - అరుణవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు. ఇక ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతల్లో ఒకరైన బోనీ కపూర్ ప్రకటించారు. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు తమిళ మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.