ఈసారి హీరోనే విలన్ గా మార్చుతున్న అజయ్

Mon Aug 03 2020 16:40:10 GMT+0530 (IST)

This time Ajay is turning the hero into a villain

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు అజయ్ భూపతి. వర్మ స్కూల్ నుండి వచ్చిన ఈ దర్శకుడు విభిన్న చిత్రాలను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే తన సెకండ్ మూవీ ‘మహసముద్రం’ను చాలా విభిన్నంగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కథ విభిన్నంగా ఉండటంతో పాటు పాత్ర ఛాలెంజింగ్ గా ఉండటంతో ఇద్దరు ముగ్గురు హీరోలు ఓకే చెప్పి ఆ తర్వాత వర్కౌట్ అయ్యేనో లేదో అంటూ తప్పుకున్నారు. చివరకు శర్వానంద్ మహాసముద్రంను ఈదేందుకు సిద్దం అయ్యాడు.మహాసముద్రం సినిమా స్క్రిప్ట్ దాదాపుగా పూర్తి అయ్యింది. కరోనా ఉదృతి కాస్త అయినా తగ్గితే సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని దర్శకుడు కాచుకు కూర్చున్నాడు. అక్టోబర్ లేదా నవంబర్ నుండి షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంతా నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

మొదటి సినిమాలో హీరోయిన్ ను నెగటివ్ షేడ్స్ లో చూపించిన దర్శకుడు అజయ్ భూపతి మహాసముద్రంలో ఏకంగా హీరో ను కాస్త నెగటివ్ గా చూపించబోతున్నాడట. ఎలాంటి పాత్రను అయినా ఈజీగా చేయగల సత్తా ఉన్న శర్వానంద్ ఖచ్చితంగా ఈ చిత్రంలోని ఆ నెగటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రకు ప్రాణం పోస్తాడనే నమ్మకంను అభిమానులు మరియు సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. రెండవ సినిమాకు కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్న దర్శకుడు అజయ్ భూపతి సక్సెస్ ను దక్కించుకునేనా అనేది చూడాలి. అన్ని సక్రమంగా జరిగితే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.