Begin typing your search above and press return to search.

రూ.75 లక్షలు.. అప్పటికి ఇప్పటి ఐశ్వర్య పెళ్లినే రికార్డ్‌

By:  Tupaki Desk   |   19 Jun 2021 11:30 AM GMT
రూ.75 లక్షలు.. అప్పటికి ఇప్పటి ఐశ్వర్య పెళ్లినే రికార్డ్‌
X
తారల పెళ్లిలు అంటే వారి వారి అభిమానులు వారి ఔట్‌ ఫిట్‌ ఇంకా వారు ధరించిన ఆభరణాలను ఎక్కువ శ్రద్దతో చూస్తూ ఉంటారు. సామాన్యులే పెళ్లి అనగానే వేలకు వేలు పెట్టి డ్రస్‌ లు తీసుకుంటూ ఉంటారు. అలాంటిది సెలబ్రెటీలు వారి పెళ్లికి మామూలుగా ఉంటారు. లక్షలు ఖర్చు చేసి మరీ వారి పెళ్లిలకు ప్రత్యే డ్రస్ లను డిజైన్ చేయించుకుంటూ ఉంటారు. కొందరు చీరల్లో పెళ్లి పీఠల మీద కూర్చుంటే మరి కొందరు ప్రత్యేకంగా పెళ్లి కోసం డిజైన్‌ చేసిన డ్రస్ లను ధరిస్తూ ఉంటారు. పెళ్లి డ్రస్‌ ల విషయంలో స్టార్‌ హీరోయిన్స్ ఒకరిని మించి ఒకరు అన్నట్లుగ పోటీ పడుతున్నారు. కాని 2007 లో పెళ్లి చేసుకున్న ఐశ్వర్య రాయ్‌ రికార్డును మాత్రం ఏ ఒక్కరు బ్రేక్‌ చేయలేదు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ పలువురు తమ పెళ్లిల కోసం లక్షలు ఖర్చు చేశారు. కేవలం డ్రస్ ల కోసమే హీరోయిన్స్‌ లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఇక ఆభరణాలకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఐశ్వర్య రాయ్ తన పెళ్లి కోసం అప్పట్లోనే ఏకంగా రూ.70 లక్షలు ఖర్చు చేసింది. బాలీవుడ్ సెలబ్రెటీల కోసం కాస్ట్యూమ్స్‌ ను డిజైన్‌ చేసే నీతా లుల్లా ఐశ్వర్య రాయ్ చీరను డిజైన్‌ చేశారు. బంగారు తీగలతో పాటు స్వరోవ్‌ స్కీక్రిస్టల్స్ తో నిండి ఉండే ఆ చీరలో ఐశ్వర్య రాయ్‌ మెరిశారు. ఐశ్వర్య రాయ్‌ పెళ్లి జరిగి ఇన్నాళ్లు అయినా కూడా ఆమె కంటే ఎక్కువ ఖరీదుతో మరే స్టార్‌ హీరోయిన్‌ కూడా కాస్ట్యూమ్స్‌ ను పెళ్లికి డిజైన్‌ చేయించుకోలేదు.

2018 సంవత్సరంలో బిజినెస్‌ మెన్‌ ఆనంద్ ఆహుజా ను వివాహం చేసుకున్న సోనమ్‌ కపూర్‌ తన పెళ్లి డ్రస్కా కోసం స్త అటు ఇటుగా 65 నుండి 70 లక్షల వరకు ఖర్చు చేశారట. స్టార్‌ హీరోయిన్ కరీనా కపూర్‌ రూ.50 లక్షల రూపాయలను బాలీవుడ్ కు చెందిన మరో స్టార్‌ హీరోయిన్‌ శిల్పా శెట్టి కూడా రూ.50 లక్షల రూపాయలను తన పెళ్లి డ్రెస్ కోసం ఖర్చు చేసిందట. ఇక విరాట్‌ కోహ్లీని వివాహం చేసుకున్న అనుష్క శర్మ తన ఆ ప్రత్యేక డ్రస్ కు గాను రూ.30 లక్షలు ఖర్చు చేసింది. ఇంకా ఎంతో మంది పది లక్షల నుండి పాతిక లక్షల మద్య ఖర్చు చేసిన వారు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోట్ల రూపాయలతో కూడా డ్రస్‌ లను డిజైన్‌ చేయించుకోవచ్చు. కాని కొందరు హీరోయిన్స్‌ ట్రోల్స్ వస్తాయని భయపడుతూ ఉన్నారని బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు.