అదృష్టం అంటే ఆ సీనియర్ హీరోదే.. ఏకంగా ఐష్ తో జత కట్టాడు

Thu Sep 29 2022 23:00:01 GMT+0530 (India Standard Time)

Aishwarya rai Bachan paired with Saratkumar Ponniyan Selvan

మాజీ ప్రపంచ సుందరి.. ఇప్పటికి తన మెరుపు అందంతో ఇట్టే ఆకట్టుకునే రూపం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ది. ఆమెతో జత కట్టేందుకు సీనియర్ నటులు మాత్రమే కాదు.. కుర్ర హీరోలు సైతం ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అలాంటిది.. ఐష్ తో వెండి తెర మీద జత కట్టే అవకాశం విలన్ గా నటించే నటుడికి వస్తే? అది కూడా సీనియర్ నటుడిగా పేరు పొందిన వేళలో.. ఆమెతో కీలకమైన రోల్ ప్లే చేసే ఛాన్సు అంటే.. అదృష్టం కాకుండా మరేంటి?మణిరత్నం కలల ప్రాజెక్టు 'పొన్నియిన్ సెల్వన్'. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఈ డ్రీం ప్రాజెక్టును తెరకెక్కించాలని తపిస్తున్న మణిరత్నం.. ఎట్టకేలకు మరో రోజులో వెండితెర మీద తన స్వప్నాన్ని ఆవిష్కరించనున్నారు.

సినిమాగా తీయాలంటే మొత్తం పది భాగాలుగా తీయాల్సిన కథను.. రెండు భాగాలుగా తీసిన మణిరత్నం.. తన మొదటి రత్నాన్ని రేపు (శుక్రవారం) థియేటర్లలో విడుదల చేయనున్నారు. అగ్ర నటీనటులు ఎందరో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రలే 15 వరకు ఉండనున్నాయి. ఈ సినిమాకు ఐశ్వర్యరాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

ఐష్ తో పాటు విక్రమ్.. కార్తిక్.. త్రిష.. ఐశ్వర్య లక్ష్మి.. శోభితా ధూళిపాళ.. జయం రవి.. విక్రమ్ ప్రభు.. సీనియర్ ప్రభు.. జయరామ్.. పార్థిబన్.. శరత్ కుమార్.. ప్రకాశ్ రాజ్ తదితరులు ఉన్నారు. ఈ మూవీలో నటిస్తున్నశరత్ కుమార్ కు జతగా ఐష్ నటించారు. ఒకప్పుడు యాక్షన్ హీరోగా సుపరిచితుడైన ఆయన.. ఇటీవల కాలంలో విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అలాంటి ఆయన ఈ మూవీలో సుందర్ చోళన్ రాజుకు మిత్రుడైన పెరియ పళవేట్టరైయర్ పాత్రలో నటించారు. చోళ రాజ్యానికి సంరక్షణే ధ్యేయంగా ఉండే భద్రుడి పాత్రలో ఆయన నటించారు. చోళ రాజ్యాన్ని దెబ్బ తీయాలనే ఎత్తుగడతో ఉండే నందిని పాత్రలో ఐష్ నటిస్తున్నారు.

ఈ చిత్రంలో ఐష్ అందానికి వశమైన భద్రుడు.. ఆమెను పెళ్లాడతారు. సీనియర్ నటుడిగా ఉన్న వేళ.. స్టార్ హీరోయిన్ తో జత కట్టే అవకాశం చాలా అరుదుగా ఉంటుంది. ఆ విషయంలో శరత్ కుమార్ ది అదృష్టమే అదృష్టమని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.