Begin typing your search above and press return to search.

అందం పెంచుకోవ‌డానికి ఐష్ శ‌స్త్ర చికిత్స‌?

By:  Tupaki Desk   |   22 May 2022 9:46 AM GMT
అందం పెంచుకోవ‌డానికి ఐష్ శ‌స్త్ర చికిత్స‌?
X
అందం పెంచుకునేందుకు.. నిత్య య‌వ్వ‌నంతో మెరిసిపోయేందుకు.. మ‌ర‌ణం ప్రాప్తించ‌కుండా ఉండేందుకు దేవ‌త‌లు అమృతం తాగారు. కానీ ఇప్పుడు అది మాన‌వుల‌కు అందుబాటులో లేదు. కానీ ఇప్పుడు మాన‌వులు అందం పెంచుకునేందుకు కావాల్సిన టెక్నాల‌జీ జిమ్మిక్కు అందుబాటులో ఉంది. ఈ అరుదైన అధునాత‌న సాంకేతిక‌త ఇప్పుడు మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ మ‌న‌సును పాడు చేసింద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

త‌న‌దైన నేచుర‌ల్ అందంతో ద‌శాబ్ధాల పాటు కుర్ర‌కారు గుండెల్లో నిదుర‌పోయిన ఐశ్వ‌ర్యారాయ్ ఉన్న‌ట్టుండి ఇలాంటి నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నారు. త‌న‌కు ఉన్న అందం స‌రిపోవ‌డం లేదా? ఈ వ‌య‌సులో ఇంకా ఎందుకు ముఖానికి శ‌స్త్ర చికిత్సలు?! అంటూ అభిమానులు చాలా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఐశ్వర్యరాయ్ తన ముఖానికి శస్త్రచికిత్స చేయించుకుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు.

భారతదేశంలోని అత్యంత అందమైన మహిళల్లో ఐశ్వర్యరాయ్ ఒకరు. అయినా కానీ త‌న‌ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ కి గుర‌వుతున్నాయి. ఇటీవ‌ల‌ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ మీద నడిచిన ఐష్ లుక్ పూర్తిగా మారిపోయి క‌నిపించింది. ఐష్‌ బ్లాక్ గౌనులో కనిపించి హొయ‌లు పోయినా కానీ మునుప‌టిలా త‌న ఫేస్ లో ఛామ్ క‌నిపించ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. త‌న ముఖాన్ని ఆవిష్క‌రించే క్లోజ్ అప్ షాట్ లు వైరల్ గా మారడంతో త‌న ముఖంలోని లోపాలు ఎత్తి చూప‌డం ప్రారంభించారు.

ఐష్‌ తన అందాన్ని పెంచుకోవడానికి కృత్రిమ పద్ధతులను ఉపయోగిస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఐష్ అందం అనే ప‌దానికి ఒక నిర్వ‌చ‌నం. అంత‌టి అందం సృష్టిలో మ‌ళ్లీ పుట్ట‌ద‌ని డైహార్డ్ ఫ్యాన్స్ న‌మ్ముతారు. కానీ ఆ అందం అంతా ఇప్పుడేమైంది. ఉన్న‌ట్టుండి ముఖం అంతా ఉబ్బిపోయి క‌నిపిస్తోంది. త‌న రూపురేఖ‌లు అదుపులో లేవు! అన్న ఆవేద‌న అభిమానుల్లో క‌నిపించింది. ఐష్ పూర్తిగా త‌న అందాన్ని ప‌ట్టించుకోవ‌డం మానేసింద‌న్న ఆవేద‌న వ్య‌క్త‌మైంది.

కార‌ణం ఏదైనా ఐష్‌ ముఖం చాలా విచిత్రంగా కనిపిస్తోంది. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో చాలా అసహ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఐశ్వ‌ర్యారాయ్ కొన్ని శస్త్రచికిత్స చేయించుకుంది.. అది ఆమెకు అస్సలు సరిపోదు.. అంటూ కొంద‌రు సూచిస్తున్నారు. అయితే న‌ల‌భై దాటాక కూడా అందాన్ని కాపాడుకోవ‌డం అంటే అంత ఈజీ కాదు. ప్ర‌తిదీ ఒక స‌వాల్ లాంటిది. కానీ ఐష్ ఇప్ప‌టికీ అంతో ఇంతో దానిని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడిలా ట్రోల‌ర్స్ భారిన ప‌డ్డారు.