టాప్ స్టోరి: హాఫ్ సెంచరీ కొట్టేస్తున్నా తగ్గేదేలే!

Sat Jan 29 2022 09:00:02 GMT+0530 (IST)

Aishwarya Rai Malaika Arora Raveena Tandon

బాలీవుడ్ వెటరన్ నాయికలు వృద్ధాప్యానికి టాటా చెప్పినట్టే కనిపిస్తోంది. రెడ్ కార్పెట్ ని షేక్ చేయడం నుంచి.. బహిరంగంగా కనిపించే స్టైలిష్ కంటెంట్ వరకూ.. మన అభిమాన నటీమణులు ఎక్కడా తగ్గేదేలే! అంటున్నారు. 40 లు దాటి 50లకు చేరువలో ఉన్నా కిల్లింగ్ లుక్స్ తో గేమ్ ఛేంజర్స్ గా కనిపిస్తున్నారు.పాత వైన్ ఎంతగా నిల్వ ఉంటే అంతగా రుచి పెరుగుతుంది అన్న చందంగా నే.. ఐశ్వర్య రాయ్- మలైకా అరోరా- టబు- రవీనా టాండన్- మాధురీ దీక్షిత్ సహా ప్రముఖ సీనియర్ నటీమణులు వయసుతో పాటు అందంలో మెరుగవుతున్నారే కానీ తగ్గడం లేదు. వారి సొగసైన దేహశిరుల ఎలివేషన్  ఖచ్చితంగా రివర్టింగ్ గా కనిపిస్తోంది.

ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రపంచంలోని అత్యంత అందమైన తారగా ఇప్పటికీ పాపులారిటీని దక్కించుకుంటోంది. ఐష్ వయసు ఇప్పటికే 48.  నవంబర్ ఒకటి 2024తో హాఫ్ సెంచరీ కొట్టేస్తుంది. మంగళూరులో జన్మించిన ఐష్ తన నటనా వృత్తిని ప్రారంభించినప్పటి నుండి అగ్ర నాయికగా పరిశ్రమలో స్థానాన్ని ఆక్రమించింది. నటనతో పాటు జాతీయ  అంతర్జాతీయ వేదికలపై ఆమె అసాధారణమైన ప్రజ్ఞా పాఠవాలు నేటితరానికి స్ఫూర్తి. సమకాలీన ప్రపంచంలో సాటి నాయికలు ఎవరూ ఐష్ ని టచ్ కూడా చేయలేనంత ఎత్తుకి ఎదిగింది.  మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకోవడం నుండి కొన్నేళ్లుగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కనిపించడం వరకు ఐశ్వర్య ఎప్పుడూ తన ప్రముఖ ఫ్యాషన్ ఎంపికలతో షో స్టాపర్ గా నిలిచింది. ఇటీవలి మీడియా ప్రదర్శనలు .. ఫోటోషూట్ లు పరిశీలిస్తే అంతా రివర్స్ లో కనిపిస్తుంది. ఐష్ కి వృద్ధాప్యం లేదని రాదని రుజువు చేస్తోంది.

మలైకా అరోరా.. లేట్ ఏజ్ లోనూ ట్రెండీ ఫ్యాషన్ ఎంపికలతో పదే పదే హాట్ నెస్ కంటెంట్ ని యూత్ లోకి పంప్ చేసింది. మలైకా వయసు 47. కానీ దానిని నమ్మడం కష్టం. తను స్వీయ సంస్కర్త. తన తలరాతను తానే మార్చుకోగల సమర్థురాలు. ఇక ఫ్యాషన్ రంగంలో తనది ప్రత్యేకమైన ముద్ర. సొగసైన చీర లుక్స్ నుండి బీచ్ బికినీ ఎంపికల వరకు ప్రతిదీ ప్రత్యేకమే.  సల్ట్రీ బ్యాక్ లెస్ డ్రెస్ ల నుండి చిక్ ఫాక్స్ లెదర్ అవుట్ ఫిట్ ల వరకు.. మలైకా గ్రేస్ అంతా ఇంతాకాదు. తన అద్భుతమైన వేషధారణలతో ఇంటర్నెట్ ను శాసించడమే కాకుండా.. ఈ వయస్సులో తను చేసే సాహసాన్ని తల్లులంతా అసూయపడేలా చేస్తోంది.

రవీనా టాండన్... టూ ఎనర్జిటిక్ అని మరోసారి ప్రూవైంది. ఇటీవల విడుదలైన `అరణ్యక్`తో ప్రేక్షకుల నుండి విపరీతమైన ప్రేమను అందుకుంటున్న రవీనా టాండన్ వయసు 47 ఏళ్లు. తన ఏజ్ గుర్తు చేస్తే షాక్ అయ్యారేమో కానీ నిజం. ఇప్పటికీ అత్యంత దృఢమైన అత్యంత మనోహరమైన బాలీవుడ్ నటీమణిగా రవీనా వెలిగిపోతోంది.  ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ ఆమెలో మరింత అందం పెరుగుతోంది. రవీనా 1994 చిత్రం `మోహ్రా`తో పేరు తెచ్చుకుంది.  `తు చీజ్ బాడీ హై మస్త్ మస్త్..` పాటతో యూత్ లో ఎంతో పాపులరైంది. మస్త్ మస్త్ గర్ల్ అనే ట్యాగ్ ని పొందింది రవీనా. ఈ బ్యూటీ ఇప్పటికీ ఈ టైటిల్ ను  కొనసాగిస్తోంది.

టబు.. భారతదేశంలోనే అత్యంత అందమైన ప్రతిభావంతులైన బహుముఖ నటి టబు గత సంవత్సరం నవంబర్ తో 51 ఏళ్లు పూర్తి చేసుకుంది. నిస్సందేహంగా ఆమె ఈ వయస్సులో కూడా నేటితరం దేవతలా కనిపిస్తోంది. టబు గొప్ప ఫిట్నెస్ ఫ్రీక్. నిరంతరం జిమ్ వ్యాయామాలను ఎప్పుడూ కోల్పోదు. బుల్లితెరపై వైవిధ్యమైన పాత్రలను ప్రదర్శించడం నుండి తన గాంభీర్యంతో తనదైన ముద్ర వేసే సత్తా తనకు అపారంగా ఉంది. టబు చాలా సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరించడం వెనక సీక్రెట్ తనలోని ఎనర్జీ. విలక్షణమైన నటప్రతిభ.

మాధురీ దీక్షిత్...... యమ్మీ మమ్మీ! వయసు 54 ఏళ్లు. ఇద్దరు పిల్లలకు తల్లి అని చెబితే ఎవరైనా నమ్ముతారా? మాధురీ దీక్షిత్ తన అందమైన ఫోటోలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తారు. ఆమె స్టైల్ ఫ్యాషన్ సెన్స్ తో  అభిమానులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాదు. ప్రత్యేక డిజైనర్ దుస్తులు నుండి పాశ్చాత్య దుస్తుల వరకు మాధురి ఏస్ డ్రెస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకుంటోంది. ఇంకా నదియా- ఇంద్రజ- రాశీ లాంటి నటీమణులు 40 ప్లస్ ఏజ్ లోనూ ఇంకా తమదైన అందం చందంతో మైమరిపిస్తున్నారు. నేటితరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.