మందాకిని వర్సెస్ నందిని! ద్విపాత్రలతో ఐష్ కంబ్యాక్ అదిరేనా?

Tue Feb 23 2021 10:00:01 GMT+0530 (IST)

Aishwarya Rai Dual Role In Mani Ratnam Film

ఒకే సినిమాలో రెండు విలక్షణ పాత్రల్లో నటించే అరుదైన అవకాశం అందరికీ రాదు. అలాంటి అవకాశం దక్కితే ఎలా ఉంటుందో రజనీకాంత్.. చిరంజీవి.. కమల్ హాసన్ .. అమీర్ ఖాన్.. సూర్య లాంటి స్టార్లు ఇప్పటికే చూపించారు. ఎందరో ఆ తరహాలో ప్రయత్నించారు.హీరోగా విలన్ గా ఒకే ఫ్రేమ్ లో కనిపించి అదరగొట్టారు వీళ్లంతా. మళ్లీ అలాంటి పెర్ఫామెన్స్ తో కంబ్యాక్ అదరగొట్టాలన్న పంతంతో ఉన్నారట మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్. దీనిపై పరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఐష్ ప్రస్తుతం మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐదు సంవత్సరాల గ్యాప్ తరువాత  ఐష్ రీఎంట్రీ ఇస్తున్నారు. చివరిసారిగా `ఏ దిల్ హై ముష్కిల్` లో రణబీర్ కపూర్ తో కలిసి నటించారు.

మణిరత్నం సినిమాలో మందాకిని దేవిగా..నందినిగా ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక పాత్రలో పాజిటివ్ గా కనిపిస్తే మరో పాత్రలో విలన్ గా కనిపిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ సాగుతోంది. షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. ఇటీవల ఒక భారీ సెట్ లో పాట చిత్రీకరణను ముగించారు. చియాన్ విక్రమ్ సహా పలువురు క్రేజీ స్టార్లు ఇందులో నటిస్తున్న సంగతి తెలిసినదే.

2021 సౌత్ క్రేజీ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటిగా పొన్నియన్ సెల్వన్ గురించి అభిమానుల్లో చర్చ సాగుతోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలనేది దర్శకనిర్మాతలు ప్లాన్. ప్రఖ్యాత రచయిత కల్కి కృష్ణమూర్తి చారిత్రక నవల ఈ సినిమాకి మూలాధారం. రాజ రాజ చోళ అనే చక్రవర్తి జీవితకథ ను ఇందులో రచయిత నవలీకరించారు. నాలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.