తండ్రిని సినిమాలు మానేయమన్న కుమార్తె

Tue Jun 12 2018 10:44:13 GMT+0530 (IST)

Aishwarya Dhanush Suggestion to Rajinikanth

తిరుగులేని సూపర్ స్టార్ గా తమిళ సినిమాను దశాబ్దాలుగా ఏలుతున్న రజనీకాంత్ కు ఆయన కుమార్తె ఊహించని కోరిక కోరింది. తన తండ్రి సినిమాలు మానేయాలని ఆమె కోరింది. కాలా సక్సెస్ తో పాటు.. ఈ మూవీలో రజనీ మార్క్ మెరుపులు మెరిపించిన వేళ.. ఇంకా తనలో ఛార్మ్ తగ్గలేదని రజనీ ఫ్రూవ్ చేసుకున్న వేళ..అనూహ్యంగా ఆయన కుమార్తె నోటి నుంచి సినిమాలు మానేయాలన్న కోరిక కోరటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇంతకీ ఆమె ఏ సందర్భంలో.. ఎందుకలాంటి వ్యాఖ్యలు చేశారన్నది చూస్తే.. తన తండ్రిని ఇప్పటికిప్పుడు సినిమాలు పూర్తిగా మానేయాలని తాను కోరుకోవటం లేదు కానీ.. దశల వారీగా మానేయాలని కోరుతున్నానని చెప్పారు. ఎందుకంటే.. రజనీ సినిమాలు మానేసి కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్నికేటాయిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఆయన కుమార్తె ఐశ్వర్య అభిప్రాయపడ్డారు.

తన తండ్రి సినిమాల మీద ఎక్కువగా దృష్టి సారించటం తగదన్నారు.  సినిమాల్ని తగ్గించుకొని ఫ్యామిలీతో ఎక్కువగా స్పెండ్ చేయాలన్నారు. సంతోషం వస్తే పొంగిపోకూడదని.. దుఃఖం వస్తే కుంగిపోకూడదంటూ తన తండ్రి చెప్పే మాట తనకు స్పూర్తిగా ఆమె చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ.. ఏడాదికో.. రెండేళ్లకో సినిమా చేస్తేనే.. టైం కేటాయించలేదంటూ ఐశ్యర్య ఫీల్ అవుతుంటే.. మరోవైపు సినిమాలకు మించి క్షణం తీరిక ఇవ్వని రాజకీయాల్లోకి రజనీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు కదా?  మరి.. దానికి ఐశ్వర్య మాటేమిటో..?