అంత హాట్ గా కనిపించలేదంటూ టాప్ లేపిందిగా

Fri Oct 30 2020 10:30:00 GMT+0530 (IST)

Aisha sharma Stunning Looks

అబ్బే నేనేమంత హాట్ గా కనిపించలేదని చెబుతూనే ఇదిగో ఇలా టాప్ లేపింది. ఫిట్నెస్ ఫ్రీక్ నేహాశర్మ సోదరి ఐషా శర్మ గొప్ప అథ్లెట్ అన్న సంగతి తెలిసిందే. ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టే టైమ్ చూసుకుని మరీ ఫిట్నెస్ టిప్స్ ఫాలో చేస్తుంటుంది. ఆ పక్కనే చూశారుగా ఎస్ ప్రెస్సో చార్ట్. స్టీమ్డ్ మిల్క్ పుచ్చుకునేందుకు కూడా ఒక చార్ట్ మెయింటెయిన్ చేస్తోందంటే ఆహారం ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.స్పోర్ట్స్ ఇన్ వోర్ ధరించి .. సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తున్న ఐషా ఈ ఫోటోకి అంతే హాటెస్ట్ కామెంట్ ని జోడించింది. జస్ట్  !! నాట్ రియల్లీ... ఏమంత హాట్ గా కనిపించని పోస్ట్ ఇది... నో ఫిల్టర్.. నో ఫిల్టర్ నీడెడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇంతకుముందు ఈ బ్యూటీ సైక్లిస్టుగా మారి ఇచ్చిన ఫోజులు అంతర్జాలంలో అంతే వైరల్ గా మారాయి.

సోదరి నేహాశర్మను మించి హాట్ నెస్ ని బయటి ప్రపంచానికి ఆవిష్కరిస్తూ తనకంటే ఎక్కువగా ఫాలోయింగ్ పెంచుకుంటోంది ఇన్ స్టాలో. ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు కథలు వింటోందట. ఇంకా బిగ్ స్టార్స్ సరసన ఆఫర్లు ఏవీ రావడం లేదు. అయితే తన బొద్దుతనం తగ్గించుకుంటే అగ్ర హీరోల సరసనా ఆఫర్లు వెల్లువెత్తుతాయని ఆశిస్తోందట. అందుకే ఈ కసరత్తు అన్నమాట. ఆల్ ది బెస్ట్ అమ్మడూ!