Begin typing your search above and press return to search.

#టీషర్ట్ ఛాలెంజ్: గోడ అస‌నంలో ఒంపు సొంపుల విందు

By:  Tupaki Desk   |   5 April 2020 4:33 AM GMT
#టీషర్ట్ ఛాలెంజ్: గోడ అస‌నంలో ఒంపు సొంపుల విందు
X
సోష‌ల్ మీడియా యుగంలో కొత్త కొత్త ఛాలెంజ్ లు పుట్టుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. బ‌కెట్ ఛాలెంజ్ మొద‌లు ఇప్ప‌టికే ఎన్నో ర‌కాల ఛాలెంజ్ ల‌ను సెల‌బ్రిటీ ప్ర‌పంచం సామాన్య ప్ర‌పంచం అనే తేడా లేకుండా అంద‌రూ ఆద‌రించారు. త‌మ వీడియోల్ని వైర‌ల్ చేశారు. ఈ ట్రెండ్ లో టిక్ టాక్ సెన్సేష‌న్స్ కి అంతూ ద‌రీ లేదు. ప్ర‌స్తుతం కరోనావైరస్ జ‌నాల్ని ఇంట్లోనే బంధించి ఉంచుతోంది. ఆ క్ర‌మంలోనే ర‌క‌ర‌కాల ఛాలెంజ్ లు పుట్టుకొస్తున్నాయి. ఇందులో క్రియేటివ్ గా చాలా స్ట‌ఫ్ క‌నిపిస్తోంది. ఈ కోవ‌లోనే ఇదిగో ఇలా గోడ అస‌నంలో చొక్కా మార్చ‌డం...!

హాటెస్ట్ గాళ్స్ సీన్ లోకి ఎంట‌రై ఇదిగో ఛాలెంజ్ స్వీక‌రించాను అంటూ యూత్ ని హీటెక్కించేస్తున్నారు. చిరుత ఫేం నేహా శ‌ర్మ సోద‌రి ఐషా శ‌ర్మ సోష‌ల్ మీడియా వేషాలపై యువ‌త‌రానికి ఇప్ప‌టికే కొంత అవ‌గాహ‌న ఉంది. తాజాగా ``చొక్కా మార్పిడి ఛాలెంజ్ # టీషర్ట్ ఛాలెంజ్`` అంటూ బోలెడంత రుబాబ్ చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో బోయ్స్ లోకి జెట్ స్పీడ్ తో దూసుకెళుతోంది. స‌వాల్ ఏదైనా ఈ అమ్మ‌డి ఒంపు సొంపుల్ని ఆవిష్క‌రిస్తూ ఆ భంగిమలో చొక్కాను హ్యాండ్ స్టాండ్ చేసి మార్చుకుంటున్న వైనం వెర్రెత్తిస్తోంది. ఇదిగో #టీష‌ర్ట్ ఛాలెంజ్ వీడియో చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది.

ఈ త‌ర‌హా ఛాలెంజ్ కు సినీ తారలనుంచి అద్భుత స్పంద‌న వ‌స్తోంది. ఐషా శ‌ర్మ‌ విసిరిస‌న స‌వాల్ ని ఇంకా ఎవ‌రెవ‌రు స్వీక‌రిస్తారు? అన్న‌ది చూడాలి. అస‌లే స్వీయ నిర్భంధ‌నంలో ఉన్న సెల‌బ్రిటీల‌కు ఏదో ఒక ఆట‌విడుపు కావాల్సిన సంద‌ర్భ‌మిది. ఈ త‌ర‌హా ఫిట్ నెస్ - గోడ యోగా ఫీట్ కి ఆద‌ర‌ణ ద‌క్కుతుంద‌నే భావిస్తున్నారు. ఇక సోద‌రి ఐషా శ‌ర్మ‌ను బాలీవుడ్ స‌ర్కిల్స్ లో పాపుల‌ర్ చేసేందుకు అలాగే సినిమాల్లో ఛాన్సుల కోసం సిస్ట‌ర్ నేహాశ‌ర్మ నిరంత‌రం ఏదో ఒక వైర‌ల్ వీడియోని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.


వీడియో కోసం క్లిక్ చేయండి