Begin typing your search above and press return to search.

నాపై క్ర‌ష్ తో కాగిపోతే మీ ఆరోగ్యాల‌కే ముప్పు

By:  Tupaki Desk   |   6 Feb 2023 8:00 AM GMT
నాపై క్ర‌ష్ తో కాగిపోతే మీ ఆరోగ్యాల‌కే ముప్పు
X
నాపై క్ర‌ష్ తో కాగిపోతే మీ ఆరోగ్యాల‌కే ముప్పు! ..ఈ ఘాటైన‌ స్టేట్ మెంట్ ఇచ్చిందెవ‌రో తెలుసా?.. ది గ్రేట్ ఐషా శ‌ర్మ‌. చిరుత బ్యూటీ నేహా శ‌ర్మ సోద‌రి. ఈ అంద‌గ‌త్తె నిరంత‌రం స్విమ్ సూట్లు బికినీలు పొట్టి నిక్క‌ర్ల తో ప‌బ్లిగ్గా కుర్ర‌కారును రెచ్చ‌గొట్డడంలో ఘ‌నాపాటి. ఫోటోషూట్ల‌కు వ‌న్ లైన‌ర్స్ తో టీజ్ చేస్తూ నిరంత‌రం గుబులు పుట్టిస్తుంది.

ఇదిగో ఇప్పుడిలా బోల్డ్ ఫోటోషూట్ తో మ‌రోసారి టీజ్ చేసింది. శ‌ర్మా గాళ్ స్విమ్మింగ్ పూల్ లో వేడెక్కించే భంగిమ‌తో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఫ్లోర‌ల్ డిజైన్ స్విమ్ సూట్ లో అలా విర‌హంగా ఒళ్లు విరుచుకుంటూ ఒంపుసొంపుల్ని ప్ర‌ద‌ర్శించింది. ఐషా సొగసుకు ఫిదా అయిపోయిన యువ‌త‌రం బిగువులతో త‌గువులేల ల‌లనా? అంటూ ఘాటైన కామెంట్లు చేస్తున్నారు.

నాపై ట్యానింగ్.. నాపై క్ర‌షింగ్ మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.. కానీ మేం ఎలాగైనా మ్యానేజ్ చేస్తాం! అంటూ వ్యాఖ్య‌ను జోడించింది. దీనికి ప్ర‌తిగా అభిమానులు స్పందిస్తూ.. శ‌ర్మా గాళ్ సెక్సీ ఫిగర్ కి హ్యాట్సాఫ్‌! అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

గ‌తంలో పూల్ సైడ్ ఇరువురు సోదరీమణులు ఒకే రంగు బికినీని ఒకే భంగిమను ప్రయత్నించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. కానీ ఈసారి నేహాశ‌ర్మ మిస్స‌యింది. సోలోగా ఇలా ఐషా శ‌ర్మ ఫోటోల‌కు ఫోజులిచ్చింది.

సోదరీమణులు ఐషా శర్మ - నేహా శర్మ ముంబై ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో బ్రాండ్ ప్ర‌చార‌క‌ర్త‌లుగా మారుతున్నారు. ఈ భామ‌లు న‌టిగా కంటే మోడ‌ల్స్ గా షైన్ అవుతున్నారు. ఈవెనింగ్ వాక్ లకు వెళ్లినా లేదా సాయంత్రం జిమ్ లో చెమటలు క‌క్కే సెషన్ లకు అటెండ‌యినా.. ముంబైలో సాధార‌ణంగానే గాలి వేడెక్కుతుంది.

ఖ‌రీదైన బాంద్రా ఏరియాలో ప్రస్తుతం శీతాకాలపు చలిని ఎదుర్కోవడానికి ప్ర‌త్యేకించి స్వెట‌ర్లు తొడ‌గాల్సిన ప‌ని లేద‌ని యూత్ భావిస్తోంది. శర్మ సోదరీమణుల ఫిట్ నెస్ ఫ్యాషన్ గోల్స్ ని అనుస‌రించేందుకు సోష‌ల్ మీడియాల్లోకి వెళితే చాలు.. ఇంత చ‌లిలోనూ చెమ‌ట‌ల‌తో త‌డిసిపోవ‌డం ఖాయం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.