ఫోటో స్టొరీ: సెక్సీ భామ నవ్వుతో మత్తెక్కిస్తుందే!

Thu Apr 18 2019 23:12:37 GMT+0530 (IST)

Aisha Sharma Latest Pics Shares In Instagram Viral In Social Media

రామ్ చరణ్ డెబ్యూ సినిమా 'చిరుత' హీరోయిన్ నేహా శర్మ దాదాపుగా తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి తెలిసే ఉంటుంది. హీరోయిన్ గా స్టార్డమ్ ఏమీ రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ ఫేమస్ అయింది.  హాట్ ఫోటోలు.. బికినీలు.. జిమ్ము కసరత్తుల సెల్ఫీలతో భారీ ఫాలోయింగే సంపాదించింది.  ఇక ఈ నేహకు ఐష శర్మ అనే సిస్టర్ ఉంది.  ఈ ఐష కూడా యమా హాటు.  అక్క రూట్లోనే ప్రయాణం చేస్తూ సోషల్ మీడియా టెంపరేచర్ ను ఏమాత్రం తగ్గనీకుండా జాగ్రత్త పడుతోంది.మోడల్ గా కింగ్ ఫిషర్ క్యాలెండర్ పై కూడా ఒకసారి తళుక్కున మెరిసింది.  అలా అని ఈ భామ సినిమాలలో నటించలేదని అనుకుంటారేమో.  జాన్ అబ్రహమ్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా 'సత్యమేవ జయతే' లో నటించింది. అసలే మోడలింగ్ నేపథ్యం కాబట్టి హాటు  ఫోటోలకు పోజులివ్వడం వెన్నతో పెట్టిన విద్య.  తాజాగా ఈ భామ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ చేసింది. ఐషా గోవాకు వెకేషన్ కోసం వెళ్ళిందట.   ఒక పాత కాలం ఇంట్లో బస చేసిందేమో తెలియదు కానీ అక్కడే ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలనే షేర్ చేసింది. ఆ ఫోటోకు "ఇది దాదాపు బ్లిస్ లాంటిదే" అనే క్యాప్షన్ ఇచ్చింది.

ఈ ఫోటోలో లైట్ బ్రౌన్ కలర్ గౌన్ వేసుకొని పోజిచ్చింది. మెట్ల పక్కన సిమెంట్ తో కట్టిన అరుగుపై బెడ్.. దానిపై తాపీగా కూర్చుని స్మైల్ ఇస్తోంది.  ఆ నవ్వు మాత్రం నెటిజనులను మత్తెక్కించేలా ఉంది.   స్లీవ్ లెస్ గౌన్ కావడంతో పాప పరువాలు తక్కువ వెలుతురులో కనిపించీ కనిపించనట్టుగా దోబూచులాడుతున్నాయి.  సడెన్ గా ఫోటోను చూస్తే ఏదో మాసిపోయినట్టుగా అనిపిస్తుంది కానీ ఫోటోలో ఏదో తెలియని చార్మ్ ఉంది.    ఒక నెటిజనుడు "ఈ ఫోటో ఒక ఆయిల్ పెయింటింగ్ లాగా అనిపిస్తుంది" అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.  ఒక యాంగిల్ లో చూస్తే అదీ నిజమే అనిపిస్తోంది.