Begin typing your search above and press return to search.

ఏ పూరీ నో ఆర్జీవీ క‌న్నో ప‌డాలేమో ఐషా!

By:  Tupaki Desk   |   6 Dec 2021 2:30 AM GMT
ఏ పూరీ నో ఆర్జీవీ క‌న్నో ప‌డాలేమో ఐషా!
X
ఇన్న‌ర్ లో అందాల్ని ఆర‌బోసేందుకు హ‌ద్దులు చెరిపేసేందుకు నేటిత‌రం ముద్దుగుమ్మ‌లు ఏమాత్రం వెన‌కాడ‌డం లేదు. వెన‌క‌టి కాలంలో యాంజెలీనా .. మ‌డోన్నా.. జెన్నిఫ‌ర్ అంటూ వెన‌క‌బాటుత‌నం ప్ర‌ద‌ర్శించినా కానీ ఇప్పుడు అంత‌కుమించి అంటూ భార‌తీయ న‌టీమ‌ణులు చెల‌రేగిపోతున్నారు.

ఇదిగో ఇక్క‌డ ఈ బ్యూటీ యాంజెలీనా మ‌డోన్నా రేంజు.. బేసిక్ ఇన్ స్టింక్ట్స్ ష‌రాన్ స్టోన్ రేంజునే త‌ల‌ద‌న్నేలా అందాల్ని ఆర‌బోస్తోంది. స‌రైన కంటెంట్ కాన్సెప్ట్ ని ప‌ట్టుకుని త‌న‌వ‌ద్ద‌కు ఏ ద‌ర్శ‌క‌నిర్మాతా రాలేదు కానీ గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీ షేక‌వ్వ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ముంబై బ్యూటీ ఐషా శ‌ర్మ‌.. ఇన్న‌ర్ అందాల‌కు ఆచ్ఛాద‌నేదీ? అనేంత‌గా ఆర‌బోసిందిలా.

చిరుత బ్యూటీ నేహాశ‌ర్మ సిస్ట‌ర్ ఐషా శ‌ర్మ ప్ర‌స్తుతం టాలీవుడ్ ప్ర‌వేశం కోసం ఆత్రంగా ఉంది. కానీ అవ‌కాశాలిచ్చేవాళ్లే క‌రువ‌య్యారు. ఇక గ్లామ‌ర్ హ‌ద్దులు చెరిపేసి చెల‌రేగిపోయే లా అద్భుత‌మైన స్క్రిప్ట్ ని వినిపిస్తే ఐషా నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డం క‌ష్ట‌మేమీ కాదు. మ‌రి ఎవ‌రైనా ట్రై చేస్తున్నారంటారా...? ఏ పూరీ నో ఆర్జీవీ క‌న్నో ప‌డాలేమో!