Begin typing your search above and press return to search.

శ‌ర్మాగాళ్ అందాల వ‌ల‌కు చిక్కితే అంతేగా

By:  Tupaki Desk   |   15 Oct 2021 2:30 AM GMT
శ‌ర్మాగాళ్ అందాల వ‌ల‌కు చిక్కితే అంతేగా
X
చిరుత బ్యూటీ నేహాశ‌ర్మ సోద‌రి అయేషా శ‌ర్మ ఇన్ స్టా దూకుడు గురించి తెలిసిందే. ఈ బ్యూటీ ఇటీవ‌ల‌ అక్క‌ను మించిపోతోంది. ప్రోఫెష‌న‌ల్ కెరీర్ ప‌రంగా నేహాశ‌ర్మ అంత స్పీడ్ లేక‌పోయినా.. త‌న‌దైన యూనిక్ స్టైల్ తో యూత్ ని ఆక‌ర్షిస్తోంది. ఇక సోష‌ల్ మీడియాల్లోనూ భారీ ఫాలోయింగ్ ని పెంచుకోవ‌డం లో స‌క్సెసైంది.

స్ట‌డీస్ పూర్త‌యిన అనంత‌రం అయేషా మోడ‌లింగ్ రంగంలోకి అడుగు పెట్టి అటుపై కింగ్ ఫిష‌ర్ క్యాలెండ‌ర్ గాళ్ గా పాపుల‌రైంది. కానీ ఎందుక‌నో బాలీవుడ్ లో చెప్పుకోద‌గ్గ‌ అవ‌కాశాలు అయేషాకి రాలేదు. దీంతో పాప్ ఆల్బ‌మ్స్ లోనూ అందాలు విందు చేసింది. జాన్ అబ్ర‌హాం స‌ర‌స‌న ఇటీవ‌ల‌ `స‌త్య‌మేవ జ‌య‌తే` లో ఛాన్స్ అందుకుంది. కానీ కెరీర్ మాత్రం స్పీడ్ అందుకోలేదు. దీంతో సిస్ట‌ర్ నేహా శ‌ర్మ త‌న సోద‌రి కోసం రంగంలోకి దిగి చెల్లెల్ని షైన‌ప్ చేయాల‌ని కొన్ని ర‌కాలు టిప్స్ ఇచ్చింది. కొన్ని నెలలుగా నేహాశ‌ర్మ అయేషా కెరీర్ వ్య‌వ‌హారంపైనే కాన్సంట్రేట్ చేసి ప‌నిచేస్తోంది.

అవ‌కాశాలు ఇప్పించాల‌ని త‌నకున్న ప‌రిచ‌యాల్ని ఉప‌యోగిస్తున్న‌ట్లు ఇటీవ‌లే బాలీవుడ్ మీడియా లో క‌థ‌నాలొచ్చాయి. ఇలా ఓ అక్క‌గా చెల్లెలి కోసం చేయాల్సిందంతా చేస్తోంది. కానీ అయేషా కెరీర్ మాత్రం అంతంత మాత్రంగానే సాగుతోంది. ఆ సంగ‌తులు ప‌క్క‌న‌బెడితే అయేషా శ‌ర్మ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. లేటెస్ట్ హాట్ ఫోటోల‌తో మంట‌లు రేప‌డం అయేషా ప్ర‌త్యేక‌త‌. పొట్టి నిక్క‌ర్లు.. బికినీల్లో టూమ‌చ్ గా ర‌చ్చ చేయ‌డం ఈ బ్యూటీకి వెన్న‌తో పెట్టిన విద్య. తాజాగా అయేషా మ‌రోసారి హ‌ద్దులు చెరిపేసి చెల‌రేగిపోయింది. రిస్టార్స్ట్ లో పూల్ సైడ్ టూ పీస్ లో మంటలు రేపుతోన్న ఓ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది.

ఇందులో అయేషా శ‌ర్మ డార్క్ బ్లూ క‌ల‌ర్ ఫ్లోరిష్ టూపీస్ ధ‌రించింది. త‌న‌లోని ఇన్న‌ర్ అందాల్ని ఎలివేట్ చేస్తూ కిల్లింగ్ లుక్స్ తో మంట‌లు రేపుతున్న సెల్ఫీని ఫాలోవ‌ర్స్ కి షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఈ లుక్ పై ఆక‌తాయి ల కామెంట్లు హ‌ద్దులు మీరుతున్నాయి. నేహాశ‌ర్మ టాలీవుడ్ లో `చిరుత` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అలాగే మహేష్ న‌టించిన `అతిధి`లోనూ హీరోయిన్ గా న‌టించింది.