ఇన్నర్ అందాలతో మంటలు పుట్టిస్తోంది

Sat Nov 27 2021 17:00:01 GMT+0530 (IST)

Aisha Sharma Latest Insta Picture

బాలీవుడ్ సిస్టర్స్ నేహాశర్మ -ఐషా శర్మ ఇస్పీడ్ గురించి తెలిసినదే. సినిమాలతో కంటే సోషల్ మీడియాలతోనే ఈ భామలు బిజీ. ప్రోఫెషనల్ కెరీర్ ఇంకా అంతగా స్పీడ్ అందుకోలేదు. నేహా కెరీర్ కొంతవరకూ ఓకే కానీ ఐషా మాత్రమ సోసోనే. చదువు ముగించాక ఐషా తన సోదరి నేహా శర్మ తరహాలోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి అటుపై క్యాలెండర్ గాళ్ గా పాపులరయ్యాక సినీఛాన్సుల కోసం ప్రయత్నించింది. అయినా అమ్మడికి వెంటనే అవకాశాలు రాలేదు.దీంతో రకరకాల ప్రయత్నాలు చేసింది. పాప్ ఆల్బమ్స్ లోనూ అందాలు విందు చేసింది. ఇంతలోనే క్రేజీగా జాన్ భాయ్ తో `సత్యమేవ జయతే` లో ఛాన్స్ అందుకుంది. కానీ కెరీర్ ఇంకా స్పీడ్ అందుకోలేదు. ప్రస్తుతం సిస్టర్ నేహా శర్మ తన సోదరి కోసం రంగంలోకి దిగింది. చెల్లెలిని షైనప్ చేసే పనిలో పడింది. తన మార్గదర్శనంలో కొన్ని నెలలుగా నేహాశర్మ అయేషా ట్రయల్స్ ని కొనసాగిస్తోంది. కెరీర్ కోసం పూర్తిగా కాన్సంట్రేట్ చేసి పని చేస్తోంది. అవకాశాల కోసం తన పరిచయాల్ని కూడా ఉపయోగిస్తూ.. ఆదుకుంటోందని కథనాలొచ్చాయి.  ఇలా చెల్లెలి కోసం నేహా చేయాల్సిందంతా చేస్తోంది. కానీ అమ్మడి కెరీర్ స్లోగా సాగుతోంది.

ఆ సంగతులన్నీ వదిలేస్తే.. ఐషాశర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.  లేటెస్ట్ గా హాట్ ఫోటోషూట్లతో మంటలు పుట్టిస్తోంది. పొట్టి నిక్కర్లలో బికినీల్లో టూ మచ్ గా చెలరేగడం తనకి కొత్తేమీ కాదు. తాజాగా ఐషా శర్మ మరోసారి చెలరేగిపోయింది. లో దుస్తుల్లో అందాల్ని ఆవిష్కరిస్తూ ఐషా శర్మ కాకలు రేపుతోంది. ఓర చూపులతో గుబులు రేపుతోన్న ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. వేడిగా టాప్ యాంగిల్ లో అందాల్ని ఎలివేట్ చేస్తూ..కిల్ చేస్తోంది.     ప్రస్తుతం ఈ ఫోటో ఇన్  స్టాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోపై అభిమానుల  కామెంట్లు హద్దులు మీరుతున్నాయి. మరి అక్కలా అవకాశాలు అందుకుని ఐషా శర్మ కూడా ఎప్పుడు బిజీ నటిగా మారుతుందో చూడాలి. టాలీవుడ్ కోలీవుడ్ పైనా ఈ బ్యూటీ కన్ను పడినా కానీ ఇక్కడా అవకాశాలు అయితే వెంటనే రావడం కష్టంగా ఉందట. ప్రస్తుతానికి సోషల్ మీడియా పోస్టింగుల ద్వారా యాడ్ రెవెన్యూ మాత్రం పుష్కలంగా ఉంది ఈ బ్యూటీకి. దాంతోనే మెయింటెనెన్స్ ని సాగిస్తోంది.