ఫోటో స్టొరీ: అందాలతో అమెరికాకు కిక్కిస్తోంది

Tue Jun 18 2019 17:23:38 GMT+0530 (IST)

సోషల్ మీడియా గురించి తెలిసినవారికి 'చిరుత' ఫేమ్ నేహ శర్మ పేరు తెలిసే ఉంటుంది.   సినిమాల్లో నేహ గొప్పగా సాధించిందేమీ లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ పాపులారిటీ సాధించింది.  ఈ భామకు ఒక హాటు చెల్లి ఉంది.. పేరు ఐష శర్మ.  నేహ అప్పుడప్పుడూ చెల్లితో కలిసి కసరత్తులు చేస్తూ.. ఆ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.  గ్లామర్ విషయంలో అక్క నేహకు ఈ చెల్లి ఏమాత్రం తీసిపోదు.  ఈ భామ ఒకటి అరా బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది.  జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన 'సత్యమేవ జయతే' లో హీరోయిన్ గా నటించింది..ఐష కు 1.1 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ భామ అమెరికా ట్రిప్ లో ఉంది. అక్కడి నుంచి ఒక హాట్ ఫోటోల బంచ్ ను తన ఇన్స్టా ఖాతా ద్వారా అప్లోడ్ చేసింది. ఈ ఫోటోలకు "ఓ సోమవారం.. నీకోసం నేను రెడీగా లేను.  వీకెండ్ అంతలోపే అయిపోయిందా? #ఐషా ట్రావెల్స్ #సియాటిల్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  వీకెండ్ అయిపోయింది.. సోమవారం కూడా అయిపోయింది..  ఈరోజు మంగళవారం.  అయినా సోమవారం అంటుందేంటో.  ఈ ఫోటోలలో ఐషా  శర్మ ఒక బ్లాక్ గౌన్ వేసుకుంది.  స్లీవ్ లెస్ గౌన్.. వీ నెక్ ఉండడంతో అందాల వడ్డన ఆటోమేటిక్ గా జరిగిపోయింది.

ఈ ఫోటోకు నెటిజనులు కత్తిలాంటి కామెంట్లు పెట్టారు. "నువ్వు రెడీగా లేవు కానీ నీ ఫోటోలకు మేము రెడీ".. "పర్ఫెక్ట్ హాటీ".. "ఝాకాస్ పోజ్".. "అక్కను మించిన చెల్లి" లాంటి కామెంట్లు వచ్చాయి.  ఇదిలా ఉంటే ఈ ఐష చేతిలో ప్రస్తుతం సినిమాలేవీ లేవు.  ఎవరైనా అవకాశం ఇచ్చేవరకూ ఇలాంటి ఫోటో షూట్స్ తో విరుచుకుపడుతూనే ఉంటుంది. అందులో ఏం అనుమానం లేదు.