‘అత్తారింటికి దారేది’ని దాటినా ఆనందం లేదు

Sun Jan 14 2018 13:16:07 GMT+0530 (IST)

అమెరికాలో తెలుగు సినిమా మార్కెట్ ను బాగా విస్తరింపజేసిన సినిమాల్లో ‘అత్తారింటికి దారేది’ ఒకటి. అప్పటిదాకా మన సినిమాలు మిలియన్ డాలర్ మార్కును అందుకోవడాన్నే గొప్పగా చెప్పుకునే వాళ్లు. కానీ ఆ సినిమా ఏకంగా 1.87 మిలియన్ డాలర్లు వసూలు చేసి సంచలనం రేపింది. దీని తర్వాత చాలా సినిమాలు 2 మిలియన్ మార్కును దాటాయి. ‘బాహుబలి-2’ అయితే ఏకంగా 20 మిలియన్ మార్కును కూడా దాటింది. ఐతే తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలు ఏవీ ‘అత్తారింటికి దారేది’ మార్కును అందుకోలేకపోయాయి. ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ సినిమా ‘అత్తారింటికి దారేది’ని దాటింది. ఈ సినిమా వసూళ్లు 1.9 మిలియన్ డాలర్ల మార్కును దాటాయి.2 మిలియన్ మార్కు కూడా లాంఛనమే. అయినప్పటికీ ‘అజ్ఞాతవాసి’ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లో ఆనందం లేదు. ఎందుకంటే ఈ చిత్రం టార్గెట్ మార్కులో సగం మాత్రమే వసూలు చేసిందిప్పటికి. ‘అజ్ఞాతవాసి’ ఓవర్సీస్ హక్కులు ఏకంగా రూ.19.5 కోట్లు పలికాయి. ఈ చిత్రం అక్కడ బ్రేక్ ఈవెన్ కు రావాలంటే 4 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేయాలి. అది అసాధ్యమే అనడంలో సందేహమే లేదు. కనీసం 3 మిలియన్ మార్కు అయినా అందుకుంటుందేమో అని డిస్ట్రిబ్యూటర్ ఆశిస్తున్నాడు. కానీ ఏమవుతుందో చూడాలి. ప్రిమియర్లతోనే 1.5 మిలియర్ డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం నెగెటివ్ టాక్ కారణంగా ఆ తర్వాత జోరు చూపించలేకపోయింది. మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.