పిక్ టాక్ : మళ్లీ మళ్లీ ఆశ్చర్యపర్చుతూనే ఉంది

Thu May 26 2022 09:35:40 GMT+0530 (IST)

Pic Talk: Again and again it continues to amaze Khushboo

టాలీవుడ్ మరియు కోలీవుడ్ తో పాటు సౌత్ లో అన్ని భాషల్లో నటించిన సీనియర్ హీరోయిన్ ఖుష్బు. వందల కొద్ది సినిమాలు చేసి 1980 మరియు 90 ల్లో ఒక వెలుగు వెలిగిన ఈమె ఇప్పటికి కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏదో ఒక భాషలో సినిమాలు చేస్తూనే ఉంది. ఆమద్య రాజకీయాలు అంటూ బిజీగా గడిపిన ఖుష్బూ మళ్లీ ఇప్పుడు సినిమాలు మరియు సొంత వ్యవహారాలతో కాలం గడిపేస్తున్నారు.ఆ మద్య ఖుష్బు కాస్త గ్యాప్ ఇచ్చి సోషల్ మీడియాలో తన ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోను చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్య పోవడం.. అవాక్కవడం జరిగింది. హీరోయిన్ గా చేసే కాలంలో చాలా సన్నగా చాలా అందంగా ఉన్న  ఖష్బూ సెకండ్ ఇన్నింగ్స్ లో కాస్త బొద్దుగా కనిపించారు. ఈమద్య కాలంలో ఖుష్బూ కాస్త లావుగా కనిపించారు. లావు ఉన్నా కూడా చాలా అందంగా హుందాగా కనిపించారు.

కాని ఈమద్య ఖుష్బూ చాలా సన్నగా అయ్యారు. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు అభిమానులను ఆశ్చర్యపర్చుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఖుష్బూ తన ఫోటోను షేర్ చేశారు. బరువు తగ్గడం వల్ల మొహం లో కళ తగ్గింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఖుష్బూ ఎలా ఉన్నా చాలా అందంగా ఉంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఖుష్బూ బరువు తగ్గడంకు కారణం ఏంటీ అనేది మాత్రం క్లారిటీ లేదు. కాని ఆమె ఈ వయసులో అంత కష్టపడి బరువు తగ్గడం ఎంతో మందికి ఆదర్శం అనడంలో సందేహం లేదు.

ఈ వయసులో కూడా బరువు తగ్గాలనే ఆలోచన రావడం.. కష్టపడి బరువు తగ్గడం అనేది అభినందించాల్సిన విషయం.

పాతిక ముప్పై ఏళ్ల వయసు ఉన్న వారు కూడా ఈమద్య కాలంలో భారీగా బరువు పెరుగుతున్నారు. వారు బరువు తగ్గడం కోసం చాలా కష్టపడుతున్నాం అంటారు. అయినా వారు బరువు తగ్గలేక పోతున్నారు. కొందరు హీరోయిన్స్ ఆపరేషన్ కూడా చేయించుకుంటున్నారు. కాని ఖష్బూ మాత్రం కష్టపడి వర్కౌట్స్ చేస్తూ బరువు తగ్గింది. ఆమె లుక్ అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది.