'గని' ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే ఇవేనా?

Mon Aug 15 2022 20:00:01 GMT+0530 (IST)

After effects of

కొన్ని సినిమాలు కాన్ఫిడెన్స్ ని రెట్టింపు చేస్తాయి. ఎలాంటి కథతో అయినా ముందుకు వెళ్లేలా చేస్తాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఏ కథ విన్నా అనుమానాల్ని ముందుకు వెళ్లాలా? వద్దా అనే భాయందోళనకు గురిచేస్తుంటాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఓ యంగ్ హీరో ఎదుర్కొంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. మెగా హీరో వరుణ్ తేజ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ఎఫ్ 2'తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు.ఆ తరువాత వెంటనే మాస్ మసాలా యాక్షన్ డ్రామా 'గద్దలకొండ గణేష్'తో హిట్ ని దక్కించుకున్నాడు. అయితే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'గని'తో మాత్రం భారీ డిజాస్టర్ ని దక్కించుకోవడం పలువురిని షాక్ కు గురిచేసింది. అఫ్ కోర్స్ హీరో వరుణ్ తేజ్ కూడా ఈ మూవీ ఫలితంతో ఒక్కసారిగా షాక్ కు గటురై సినిమా విడుదలైన రెండవ రోజు తప్పుచేశామని సోషల్ మీడియా వేదికగా ఓపెన్ లెటర్ రాయడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ మూవీ తరువాత 'ఎఫ్ 3'తో ఫరవాలేదనిపించే హిట్ ని దక్కించుకున్నా తదుపరి సినిమా విషయంలో మాత్రం కొంత డైలమాకు గురవుతున్నారట. ఎలాంటి కథలు ఎంచుకోవాలి? ఏవి చేస్తే మంచిది?  ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కథ మంచిదేనా? అనే డైలమాకు గురవుతున్నారట. 'ఎఫ్ 3' తరువాత వరుణ్ తేజ్ ఓ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయిపోయారు.

అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. అయితే ప్రాజెక్ట్ ప్రకటించి నెలలు కావస్తున్నా దీనికి సంబంధించి ఎలాంటి కదలిక లేదు.

ఈ ప్రాజెక్ట్ వెనక ఏం జరుగుతోందా? అని ఆరా తీస్తే..ఆసక్తికరమైన విషయం ఒకటి బయటికి వచ్చింది. 'గని' ఫ్లాప్ తో డైలమాలో వున్న వరుణ్ తేజ్ .. ప్రవీణ్ సత్తారు ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలై విదేశాల్లో షూటింగ్ కోసం వీసాలు పర్మీషన్ లు తీసుకున్నా వరుణ్ ఈ మూవీపై సుముఖంగా లేనట్టుగా తెలుస్తోంది.

మేకర్స్ కూడా పెద్దగా ఆసక్తిని చూఏపించడం లేదని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు .. కింగ్ నాగార్జున తో 'ది ఘోస్ట్' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ తరువాత అయినా వరుణ్ లో ప్రవీణ్ సత్తారు ప్రాజెక్ట్ పట్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుందేమో చూడాలి అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదంతా గమనిస్తున్న వాళ్లంతా 'గని' ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే ఇవేనా? అంటూ కామెంట్ లు చేస్తున్నారు.