Begin typing your search above and press return to search.

రౌడీ స్టార్‌ ఆ వివాదాస్పద పాత్రను చేస్తాడా?

By:  Tupaki Desk   |   5 Dec 2019 5:36 AM GMT
రౌడీ స్టార్‌ ఆ వివాదాస్పద పాత్రను చేస్తాడా?
X
ప్రస్తుతం బయోపిక్‌ ల ట్రెండ్‌ నడుస్తుంది. తెలుగు.. హిందీ.. తమిళం అని కాకుండా అన్ని చోట్ల కూడా బయోపిక్‌ లు రూపొందుతున్నాయి. తమిళనాట మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ లు ఏకంగా మూడు రూపొందుతున్నాయి. అందులో ముఖ్యంగా 'తలైవి' చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ లో కనిపించబోతుంది. ఇక ఈ సినిమాను అన్ని భాషల వారికి రీచ్‌ అయ్యేలా చేయాలని అన్ని భాషలకు చెందిన నటీనటులను ఈ చిత్రంలో నటింపజేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

జయలలిత సినీ కెరీర్‌ లో మరియు వ్యక్తిగత జీవితం లో కూడా తెలుగు అందగాడు శోభన్‌ బాబు కు ప్రత్యేకమైన స్థానం ఉందని అంటూ ఉంటారు. వీరిద్దరు ప్రేమించుకున్నారని.. పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్దమయ్యారంటూ వార్తలు వచ్చాయి. జయలలిత చనిపోయిన సమయంలో ఆమెకు శోభన్‌ బాబు వల్ల ఒక కుమార్తె ఉందనే వార్తలు జోరుగా వచ్చాయి. కాని అవి పుకార్లే అని తేలిపోయింది. అసలు జయలలిత ఎందుకు శోభన్‌ బాబును వివాహం చేసుకోలేదు అనే విషయం చాలా మందికి తెలియదు. ఇద్దరి మద్య ఉన్న విషయం ఏంటీ అనేది కూడా చాలా మంది తెలుసుకోవాలని ఆశ పడుతున్నారు.

ఆ విషయాలను తలైవి చిత్రం లో చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని.. ఈ చిత్రంలో శోభన్‌ బాబు పాత్రకు గాను రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండను సంప్రదిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. విజయ్‌ దేవరకొండ ఓకే చెప్పాడా లేదా అనే విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఒక వేళ తలైవి లో విజయ్‌ దేవరకొండ కనుక నటిస్తే అది ఖచ్చితంగా సంచలనం అవుతుంది. శోభన్‌ బాబు పాత్ర అనేది తలైవి సినిమాలో ఉండటం వివాదాస్పదం అవ్వడం కన్ఫర్మ్‌. మరి అలాంటి వివాదాస్పద పాత్ర ను రౌడీ చేసేందుకు ఆసక్తి చూపుతాడా.. అసలు అంత తెగువను రౌడీ స్టార్‌ చూపిస్తాడా అనేది చూడాలి.