అదుర్స్ 2 అవ్వదమ్మా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

Thu Sep 29 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Adurs 2 Director VV Vinayak gave Clarity

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్ని డిఫరెన్స్ సినిమాలు ఉన్నా.. మరెన్నీ మాస్ సినిమాలు ఉన్నా కూడా అందులో చాలామంది ఆడియన్స్ కి ఎక్కువగా నచ్చేది మాత్రం అదుర్స్ సినిమా అనే చెప్పాలి. ఇందులో చారి అనే పాత్రలో ఎన్టీఆర్ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ ను అయితే ఆ సినిమా మళ్ళీ మళ్ళీ థియేటర్ల కు రప్పించేలా చేసింది.2010 లో వచ్చిన అదుర్స్ అప్పట్లో ఎన్టీఆర్ కెరీర్ లో కూడా అదే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా కూడా నిలిచింది. దర్శకుడు వివి వినాయక్ కంప్లీట్ గా కామెడీ సినిమా చేస్తే ఈ రేంజ్ లో ఉంటుందని ఎవరు ఊహించలేదు. అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ ఒకవైపు చారి పాత్రలో మరొకవైపు మాస్ యాక్షన్ పాత్రలో ఎంతగానో మెప్పించాడు. ముఖ్యంగా బ్రహ్మానందం కామెడీ అయితే మరొక లెవెల్లో క్లిక్ అయింది.

ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో అదుర్స్ సినిమాకు సంబంధించిన మీమ్స్ సైతం ఒక రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుంది అని చాలామంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

ఇక ఆ డిమాండ్ మేరకు వివేవి నాయక్ కూడా మధ్యలో కొన్ని ప్రయత్నాలు కూడా చేశాడు. ఈ విషయంలో అప్పట్లో ఎన్టీఆర్ కూడా కాస్త సీరియస్ గానే చర్చలు జరిపాడు.

తప్పకుండా సీక్వెల్ చేద్దామని కూడా అందరూ డిసైడ్ అయ్యారు. అయితే మళ్ళీ ఎందుకో ఎవరు దాని గురించి మాట్లాడలేదు. కానీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు వినాయక్ ఎట్టకేలకు ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.

అసలు అదుర్స్ 2 అనేది మళ్లీ ఉండదు అని తేల్చి చెప్పేసాడు. అందుకు కారణం కూడా ఆయన వివరించాడు. అదుర్స్ అనేది ఎన్టీఆర్ కు అలాగే తన కెరీర్ లో ఒక బెస్ట్ మూవీ అని దాన్ని అలా ఉండనిస్తే బెటర్ అని మధ్యలో రెండు మూడు ఐడియాలు కూడా అనుకున్నప్పటికీ ఎందుకో వర్కౌట్ కాలేదు అని వినాయక్ చెప్పాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.