Begin typing your search above and press return to search.

ఫోటోలతో వైరస్ స్ప్రెడ్ చేస్తున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   28 March 2020 12:30 PM GMT
ఫోటోలతో వైరస్ స్ప్రెడ్ చేస్తున్న హీరోయిన్
X
టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్న బ్యూటీ రష్మిక మందన్న. ఛలో సినిమాతో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగళూరు భామ గీత గోవిందం తరువాత తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో విజయ్‌ దేవరకొండతో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. తర్వాత నితిన్ సరసన నటించిన 'భీష్మ' సినిమా కూడా హిట్ అవడంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస విజయాలు వచ్చి పడటంతో వరుస అవకాశాలు కూడా తలుపు తట్టాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించే సినిమాలో హీరోయిన్ గా రష్మిక ఎంపికైన విషయం తెలిసిందే. అయితే తన సక్సెస్ రేట్ ను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆమె తనకి నచ్చిన పాత్రలను మాత్రమే అంగీకరిస్తూ వెళుతోంది.

కమర్షియల్ సినిమాలు మాత్రమే చేయాలనే నిర్ణయంతో ముందుకు వెళుతోంది. ఈ కారణంగానే హిందీ రీమేక్ జెర్సీ లో ఛాన్స్ ను వదులుకుంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకి మంచి ఫాలోయింగ్ ఉంది. డియర్ కామ్రేడ్ చిత్ర పరాజయంతో సోషల్ మీడియాలో హవా తగ్గించిన ఈ అమ్మడు రెండు వరుస బ్లాక్ బస్టర్స్ పలకరించడంతో మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. తన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. కరోనా ఎఫెక్ట్ వల్ల షూటింగులు లేకపోవడంతో తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో సరిలేరు నీకెవ్వరూ, భీష్మ లను టాగ్ చేస్తూ అప్లోడ్ చేసిన ఫోటో వైరల్ అయ్యింది. ఈ ఫోటోలో తన చేతులతో లవ్ సింబల్ చూపిస్తూ లవ్ స్ప్రెడ్ అంటూ క్యోట్ చేసింది. ఈ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటున్నది.