Begin typing your search above and press return to search.

ఆర్టిస్టుల జీవితాలు స్టాక్ మార్కెట్ లాంటివి : అడివి శేష్

By:  Tupaki Desk   |   2 Dec 2022 8:30 AM GMT
ఆర్టిస్టుల జీవితాలు స్టాక్ మార్కెట్ లాంటివి : అడివి శేష్
X
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ లేటెస్ట్ గా తన హిట్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మామూలుగా అయితే తన సినిమా కథలను తానే రాసుకునే అడివి శేష్ శైలేష్ కొలను డైరెక్షన్ లో హిట్ 2 చేశారు. ఈ సినిమా చేయడానికి తనని ఆసక్తి కలిగించిన విషయాలను ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అడివి శేష్. హిట్ 1 విశ్వక్ సేన్ చేశాడు.. హిట్ 2 కోసం తనని అడిగితే ముందు చేయనని చెప్పానని.. కానీ ఇదొక ఫ్రాంచైజ్ లా చేస్తున్నారని తెలిసి ఓకే అన్నాను. థ్రిల్లర్ సినిమాల్లో కిల్లర్ ఎవరన్నది అన్ని సినిమాల్లో ఆసక్తికరంగా ఉంటుంది. కానీ ఇందులో మాత్రం ఎలా చేశాడు అన్నది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అందుకే హిట్ 2 చేశానని అన్నారు.

నాని నిర్మాతగా చాలా కంఫర్ట్. ఒక నటుడికి ఉన్న డౌట్లని ఆయన అర్ధం చేసుకున్నారు. అందుకే ఈ సినిమాలో శేష్ కి వచ్చిన కొన్ని డౌట్స్ సాటి హీరోగా నాని అర్ధం చేసుకున్నారట. తనకు ఖైదీ, విక్రం సినిమాలు చాలా ఇష్టమని.. హిట్ 2 విక్రం సినిమాలా ఆడాలని అన్నారు అడివి శేష్. ఈ మూవీని ఇంటర్వల్ లేకుండా చూస్తే ఇంకా బాగుంటుందని అన్నారు.

మేజర్ ఒక బయోపిక్ ఆ కథని తీయడానికి చాలామందిని ఒప్పించాల్సి ఉంటుంది. ఇది డిఫరెంట్ కథ.. కాబట్టి దీనికి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు. హారర్, డ్రగ్స్ సినిమాలు తను చూడలేనని.. కానీ ఈ మూవీలో హారర్ వేరేలా ఉంటుందని అన్నారు అడివి శేష్.

ఇక హిట్ 2 ని హిందీలో కూడా రిలీజ్ చేస్తామని అన్నారు అడివి శేష్. ఢిల్లీ, ముంబైలో నేరుగా ప్రమోషన్స్ చేసి హిట్ 2 రిలీజ్ చేస్తామని అన్నారు. డిసెంబర్ 30న హిట్ 2 హిందీ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు.

ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు ముందే కథ లీక్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే కథ లీక్ కాకుండా జాగ్రత్త పడాలి. ప్రస్తుతం మన సినిమాలు హిందీ ప్రేక్షకులకు బాగా నచ్చేస్తున్నాయి. మన సినిమాలు అక్కడ మంచి ఫలితాలు అందుకోవడం మంచి తరుణమని అన్నారు అడివి శేష్. ఇక తను నటించిన క్షణం సినిమా కోసం నార్త్ నుంచి పోటీ పడి మరీ రైట్స్ తీసుకున్నారు. ఆ సినిమా అక్కడ కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. తన ప్రతి సినిమా నేషనల్ వైడ్ గా మంచి టాక్ తెచ్చుకోవడం మంచి విషయమని అన్నారు.

అడివి శేష్ కేవలం ఇలాంటి కథలే చేస్తాడు అన్న విధంగా కాకుండా తనకు నచ్చిన ప్రతి కథ చేస్తానని అంటున్నారు. కామెడీ సినిమాలు చేయాలని ఉందని అంటున్న అడివి శేష్ ఆర్టిస్టుల జీవితాలు కూడా షేర్ మార్కెట్ లాంటిదే అని అన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.