హిట్ 2 అక్కడ కూడా.. అడివి శేష్ క్లారిటీ..!

Tue Nov 29 2022 16:15:06 GMT+0530 (India Standard Time)

AdiviSesh About HIT2 Film Hindi Release

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన సినిమాలతో ఆడియన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాడు. తన కథలతో ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమా ఎక్స్ పీరియన్స్ ఇస్తున్న అడివి శేష్ కొత్తగా మరో డైరక్టర్ కథతో సినిమా చేశాడు. అదే హిట్ 2.. నాని నిర్మాతగా తెరకెక్కిన ఈ మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చేశారు. ఈ మూవీ డిసెంబర్ 2న రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వచ్చి అలరించారు.హిట్ ఫ్రాంచైజ్ లను కొనసాగించాలని.. ప్రతి ఏడాది ఈ టైం కు ఒక హిట్ మూవీ రావాలని అన్నారు రాజమౌళి. జక్కన్న ఇచ్చిన ఐడియా ఏదో బాగుంది అని నాని అండ్ టీం అనుకున్నారు. ఇక ఈ సినిమా విషయంలో అడివి శేష్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది.

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హిట్ 2 హిందీ రిలీజ్ పై కూడా క్లారిటీ ఇచ్చాడు అడివి శేష్. హిందీలో కూడా ఈ మూవీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని.. రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది త్వరలో వెల్లడిస్తామని అన్నారు.

రీసెంట్ గా మేజర్ తో నేషనల్ వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు అడివి శేష్. అందుకే ఆ సినిమా వల్ల హిట్ 2 కి హిందీలో క్రేజ్ ఏర్పడింది. అదీగాక థ్రిల్లర్ సినిమాలను బాలీవుడ్ ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడతారు. అందుకే హిట్ 2 ని హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

వరుస సినిమాలతో తన మార్కెట్ పెంచుకుంటున్న అడివి శేష్ మేజర్ తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో హిట్ 2 కి అడివి శేష్ ని చూసి బాలీవుడ్ నుంచి ఫ్యాన్సీ ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తుంది.

మొత్తానికి అడివి శేష్ వల్ల హిందీ లో కూడా హిట్ 2 కి క్రేజ్ ఏర్పడింది. హీరోగానే కాదు నిర్మాతగా కూడా నాని తన ప్రతిభ కనబరుస్తున్నారు. అంతేకాదు హీరోగా హిట్టు ఫాం కొనసాగిస్తూనే నిర్మాతగా కూడా అదే జోష్ కొనసాగిస్తున్నాడు. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.