Begin typing your search above and press return to search.

హిట్ 2 చూసి అది మాత్రం చేయకండి అంటున్న అడివి శేష్..!

By:  Tupaki Desk   |   29 Nov 2022 5:49 AM GMT
హిట్ 2 చూసి అది మాత్రం చేయకండి అంటున్న అడివి శేష్..!
X
నాని హోమ్ బ్యానర్ వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి, నాని నిర్మాతలు గా తెరకెక్కిన థ్రిల్లింగ్ సస్పెన్స్ యాక్షన్ మూవీ హిట్ 2. అడివి శేష్, మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చేశారు. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన హిట్ 2 పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశారు. మండే ఈవెనింగ్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్ కి గెస్ట్ గా దర్శక ధీరుడు రాజమౌళి అటెండ్ అయ్యారు.

ఈ ఫంక్షన్లో అడివి శేష్ మాట్లాడుతూ.. ఈ వేడుకకి అనుష్క గారిని కూడా ఆహ్వానించాము కానీ ఆమె రాలేకపోయారు. ఈ సినిమాకి పనిచేసిన వాళ్లంతా బయట నుంచి వచ్చి కష్టపడి సాధించి ఈ రోజున మీ ముందు నిలబడ్డారు. నాని నచ్చనివారు .. నాని సినిమా నచ్చనివారు ఎవరూ ఉండరు .. నాతో సహా అని అన్నారు అడివి శేష్.

ప్రతి సినిమా స్పీచ్ లో ఎంతో కంఫర్ట్ గా కాన్ఫిడెంట్ గా మాట్లాడే అడివి శేష్ రాజమౌళి ఎదుట తడబడ్డారు. అంతేకాదు ఏం మాట్లాడాలో చేతిలో రాసుకుని వచ్చారు. చేతి వంక చూస్తూ మాట్లాడారు అడివి శేష్.
రాజమౌళి గారు బాహుబలి చేస్తుండగా, చాలా రోజుల పాటు చాలా దగ్గర నుంచి గమనించాను. ఎప్పటికీ స్టూడెంటులా ఉండాలనే విషయాన్ని ఆయన నుంచి నేర్చుకున్నాను.

నేను ఇంతగా కష్టపడానికి స్ఫూర్తి ఆయనే. రాజమౌళిగారు ఎక్కడైనా తారసపడితే హలో.. హాయ్ అంటూ పలకరిస్తూ ఉంటాను. నాని, రానా మాదిరిగా నాక్కూడా ఆయనతో చనువుగా మాట్లాడాలనిపిస్తుంది.

కానీ ఒక గురువుతో శిష్యుడు అలా మాట్లాడవచ్చా.. అనే సందేహంతో ఆగిపోతూ ఉంటాను. ఆయనకి నేను ఏకలవ్య శిష్యుడిని. ఎంత దూరం వెళ్లినా మన వాళ్లను మరిచి పోకూడదనే విషయాన్ని కూడా నేను నేర్చుకున్నాను. ఆడియన్స్ నుంచి నమ్మకాన్ని సంపాదించుకోవడం కోసమే 12 ఏళ్లుగా నేను కష్టపడుతున్నాను.

ప్రతిసారి సక్సెస్ అవుతానో లేదో తెలియదు గానీ, నా ప్రయత్నం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని అన్నారు అడివి శేష్. డిసెంబర్ 02 న హిట్ 2 వస్తుందని మీ అందరికి తప్పకుండా నచ్చుతుందని అన్నారు అడివి శేష్. సినిమా చూసిన ఆడియన్స్ స్పాయిలర్స్ బయటకు చెప్పకండి.. సినిమా బాగుంది బాగాలేదు అన్నది సోషల్ మీడియాలో పెట్టండి కానీ సినిమా సస్పెన్స్ ని రివీల్ చేయవద్దు అని రిక్వెస్ట్ చేశారు అడివి శేష్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.